మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘విశ్వంభర’ చిత్రం ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది.వాస్తవానికి 2025 సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ కావాలి. తర్వాత కొన్ని కారణాల వల్ల సమ్మర్ కి పోస్ట్ పోన్ అయ్యింది. ఆ తర్వాత ఎటువంటి రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు చిత్ర బృందం. ఎందుకంటే గ్లింప్స్ కి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా వి.ఎఫ్.ఎక్స్ గురించి చాలా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి.
దీంతో నిర్మాతలు జాగ్రత్త పడాల్సి వచ్చింది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు అని భావించి మరి కాస్త బడ్జెట్ పెట్టి.. క్వాలిటీ ఔట్పుట్ తోనే సినిమా జనాల్లోకి వదలాలని భావించి టైం తీసుకున్నారు. మొత్తానికి ఫైనల్ ఔట్పుట్ సంతృప్తి కరంగా వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో దర్శకుడు వశిష్ట అండ్ టీం టీజర్ ను కట్ చేసే పనిలో పడ్డారు. ఆగస్టు 22న ‘విశ్వంభర’ టీజర్ రానుంది.
దీంతో కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటిస్తారని సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘విశ్వంభర’ చిత్రాన్ని అక్టోబర్ 17న దీపావళి పండుగ కానుకగా విడుదల చేయాలని యూవీ క్రియేషన్స్ సంస్థ డిసైడ్ అయ్యిందట. అయితే అదే టైంకి సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ , కిరణ్ అబ్బవరం ‘k -ramp’ సినిమాలు ప్రకటించారు. ఇప్పుడు ‘విశ్వంభర’ కనుక ఆ డేట్ కి వస్తే.. ఆ సినిమాలు రిలీజ్ చేయడానికి మేకర్స్ ఆలోచనలో పడతారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..!