2019 ప్రత్యక్ష ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరంలో ఎమ్మెల్యేగా దారుణంగా ఓడిపోవడాన్ని ఎవరూ మర్చిపోలేరు. 2019 ఎన్నికల్లో జనసేన కీలకపాత్ర పోషిస్తుంది అని అందరూ అనుకొంటున్న తరుణంలో కనీసం డిపాజిట్లు కూడా రాబట్టుకోలేకపోయింది. ఆ పరాజయాన్ని పవన్ కళ్యాణ్ పెద్దగా పట్టించుకోలేదనుకోండి.. ల్ట్స్ వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ తాను గెలిచినా, ఓడినా ప్రజలకు సేవ చేసుకుంటూ ఉండిపోతాను అని చెప్పడం అతని నిజాయితీని మరోసారి జనాలకు చాటి చెప్పింది.
అయితే.. అమెరికాలో జరుగుతున్నా తానా సభలకు ముఖ్య అతిధిగా హాజరైన పవన్ కళ్యాణ్.. మొదటిసారి తన పరాజయం గురించి స్పందించాడు. “ఒక పది నిమిషాలు మాత్రమే నేను ఓడిపోయానన్న బాధలో ఉన్నాను. 10 నిమిషాల తర్వాత ఆ విషయం మరిచిపోయాను. జనాల జీవితాలను మెరుగుపరచాలనే ఆశయంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను తప్పితే గెలుపు, ఓటములు చూసి నీరసించిపోయే రకం కాదు నేను” అని చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. ఇకపోతే.. తానా సభల్లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్స్ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. ఆయన మళ్ళీ సినిమాల్లోకి రావాలని ఆయన అభిమానులందరూ కోరుకొంటున్నారు. మరి పవన్ ఏ నిర్ణయం తీసుకొంటాడో చూడాలి.