తమిళ హీరో, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ మరియు నిర్మాత అయిన రాఘవ లారెన్స్ , కొంత గ్యాప్ తరువాత మళ్లి తనకి బాగా క్రేజ్ తీసుకు వచ్చిన కాంచన సిరీస్ లోని కాంచన 4 తో ప్రేక్షకులను అలరించటానికి సిద్దమయ్యాడు. ఈ కాంచన సిరీస్ ద్వారా రాఘవ లారెన్స్ హీరోగా తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నాడు. కేవలం హీరోగా మాత్రమే కాక డైరెక్టర్ గా కూడా విమర్శకుల ప్రశంసలు సైతం పొందాడు. ఒక కొత్త హారర్ కామెడీ జానర్ ను ఎంచుకుని తనదైన శైలిలో ప్రేక్షకులకు థియేటర్లలో ఎక్సయిట్మెంట్ ని అందించాడు.
కాంచన సిరీస్ లో ఇప్పటికే మూడు సినిమాలు రాగా ఒకదానికి మించి ఇంకోటి అన్నట్లు వివిధ రకాల పాత్రలను పరిచయం చేస్తూ , రాఘవ లారెన్స్ హారర్ కామెడీలో కొత్త ఒరవడిని సృష్టించారు. కాంచన 3 తరువాత కొంత గ్యాప్ తీసుకున్న లారెన్స్ కాంచన 4 షూటింగ్ ని దాదాపుగా కంప్లీట్ చేసేసాడు . అయితే ఈ సినిమా బిజినెస్ విషయానికొస్తే , ఇదే సిరీస్ లో దీని ముందు రిలీజ్ అయినా చిత్రాలకంటే అనూహ్యంగా ఈ కాంచన 4 ఫాన్సీ రేట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. ఎందుకు అంటే కాంచన సిరీస్ లో ప్రతి సినిమా కలెక్షన్ల పరంగా కాసుల వర్షం కురిపించాయి . అదే హైప్ ఈ కాంచన 4 కి కూడా వుంది అనేదాంట్లో సందేహం లేదు . అందుకే ఈ సినిమా ఇప్పటికే 100 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్టు కోలీవుడ్ సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్.
దీనిలో భాగంగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ 50 కోట్లకు అమ్ముడుపోగా , హిందీ వెర్షన్ రైట్స్ మరో 50 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఈ విధంగా చూస్తే కాంచన 4 రిలీజ్ కి ముందే 100 కోట్లకు పైగా బిజినెస్ చేసింది అని అర్ధం అవుతుంది. ఈ సినిమాలో తన స్వీయ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ హీరో గా, పూజ హెగ్డే & నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముఖ్య పాత్రలలో కోవై సరళ , దేవ దర్శిని, రామచంద్ర రాజు నటిస్తున్నారు. ఈ సిరీస్ లో మునుపటి చిత్రాల లాగే కాంచన 4 ఎంత వరకు మెప్పిస్తుందనేది చూడాలి?