రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డ్ లను సొంతం చేసుకోవడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. ఈ సినిమా విడుదలై దాదాపుగా రెండు సంవత్సరాలు అయిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఏ రేంజ్ లో హిట్టైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ లో చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ ను ప్రేక్షకులు సులువుగా మరిచిపోలేరు.
అయితే ఈ సాంగ్ కు 104 సంవత్సరాలు అంటూ ఆర్ఆర్ఆర్ టీం చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ కథ ప్రకారం రామ్, భీమ్ 1920 సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన ఈ పాటకు డ్యాన్స్ చేశారు. ఆ లెక్క ప్రకారం ఈ సాంగ్ కు 104 సంవత్సరాలు అవుతుందని ఆర్ఆర్ఆర్ టీం చెబుతోంది. ఈ సాంగ్ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్ వచ్చింది. ఓటీటీలో సైతం ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి.
నాటు నాటు (Naatu Naatu) సాంగ్ తెలుగు వెర్షన్ కు ఇప్పటివరకు యూట్యూబ్ లో ఏకంగా 195 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. మరికొన్ని రోజుల్లో ఈ సాంగ్ 200 మిలియన్ల మార్కును అందుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఈ సాంగ్ తమకు ఎంతగానో నచ్చిందని చెబుతున్నారు. చరణ్, తారక్ కెరీర్ లో ఈ సాంగ్ ఎప్పటికీ స్పెషల్ సాంగ్ అని చెప్పవచ్చు.
ఆర్ఆర్ఆర్ సీక్వెల్ లో చరణ్, తారక్ నటించాలని ఫ్యాన్స్ భావిస్తుండగా ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్తుందో లేదో చూడాలి. రాజమౌళి ఒక్కో సినిమాకు 4 నుంచి 5 సంవత్సరాల సమయం తీసుకుంటూ ఉండటంతో ఈ కాంబినేషన్ లో సినిమా సాధ్యమవుతుందో లేదో చూడాలి. రాజమౌళి రియాక్ట్ అయితే ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.
ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!
‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!