Hanu Man Movie: ‘హనుమాన్’ మాత్రమే క్రియేట్ చేసిన 12 రికార్డులు ఏంటో తెలుసా?

‘హనుమాన్’ సినిమా జనవరి 12న రిలీజ్ అయ్యింది. విడుదలకి ముందు ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. టీజర్, ట్రైలర్స్ తో భారీ హైప్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ.. నైజాంలో థియేటర్స్ దొరక్క చాలా ఇబ్బందులు పడింది. అయితే తర్వాత అన్ని అడ్డంకులను దాటుకుని జనవరి 11 నే ప్రీమియర్స్ తో బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుని వీరవిహారం చేసింది.. కాదు కాదు చేస్తూనే ఉంది. 2024 సంక్రాంతి విన్నర్ గా నిలవడం మాత్రమే కాకుండా ‘హనుమాన్’ క్రియేట్ చేసిన రికార్డులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) 1000 కి పైగా ప్రీమియర్ షోలు పడ్డ ఏకైక తెలుగు సినిమా. గతంలో ఏ సినిమాకి ఇలాంటి ఘనత దక్కింది లేదు. ఇది ఆల్ టైం రికార్డ్ అనే చెప్పాలి.

2) సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ నమోదు చేసిన సినిమాగా ఇప్పటికైతే.. 2వ స్థానంలో ఉంది. రాబోయే రోజుల్లో ఆ రికార్డుని కూడా బ్రేక్ చేసే ఛాన్స్ లేకపోలేదు. మొదటి స్థానంలో ‘అల వైకుంఠపురములో’ మూవీ ఉంది. కాకపోతే అది పాన్ ఇండియా సినిమా కాదు.

3) 2024 లో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ నమోదు చేసిన సినిమాగా కూడా ‘హనుమాన్’ రికార్డులకెక్కింది. అది కూడా పోటీగా మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా ఉన్నప్పటికీ ఆ రికార్డు కొట్టడం అంటే మాటలు కాదు.

4) నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ నమోదు చేసిన 5వ సినిమాగా ‘హనుమాన్’ నిలిచింది. ఇంకా కలెక్ట్ చేస్తూనే ఉంది.

5) ఇప్పటివరకు రూ.250 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇంకా కలెక్ట్ చేసే ఛాన్సులు ఎక్కువే ఉన్నాయి.

6) అలాగే ఇప్పటివరకు రూ.130 కోట్ల పైగా షేర్ ను కలెక్ట్ చేసిన సినిమాగా కూడా రికార్డు కొట్టింది ‘హనుమాన్’

7) నైజాంలో ఇప్పటివరకు రూ.50 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. అది కూడా మొదటి వీకెండ్ ఎక్కువ థియేటర్లు లేకుండానే..!

8) నైజాంతో పాటు ఓవర్సీస్, హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా వంటి రీజన్స్ లో రూ.50 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన అతి తక్కువ సినిమాల్లో ‘హనుమాన్’ కూడా స్థానం సంపాదించుకుంది. ఇది కూడా చెప్పుకోదగ్గ రికార్డు అనే చెప్పాలి.

9) 15 రోజు ఏ తెలుగు సినిమా కూడా కలెక్ట్ చేయని విధంగా ‘హనుమాన్’ కలెక్ట్ చేసింది. రిపబ్లిక్ డే హాలిడే వల్ల ఆ రికార్డు కూడా సొంతం చేసుకున్నట్లు అయ్యింది.

10) ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో 8 వ సినిమాగా కూడా ‘హనుమాన్’ రికార్డులు సృష్టించింది.

11) ఇప్పటివరకు 1 కోటి ఫుట్ ఫాల్స్ అంటే కోటి మంది ‘హనుమాన్’ చిత్రాన్ని చూశారు. ఇది కూడా మామూలు విషయం కాదు.

12) 92 ఏళ్ళ తెలుగు సినీ చరిత్రలో రూ.100 కోట్లు లాభాలను అందించిన అతి తక్కువ సినిమాల్లో (Hanu Man) ‘హనుమాన్’ కూడా చేరింది. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల్లో ఇది ఆల్ టైం రికార్డు అనే చెప్పాలి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus