‘సైరా’ నరసింహారెడ్డి లో ఆకర్షించే అంశాలు ఇవే!

  • September 30, 2019 / 03:28 PM IST

ఒక్క మెగా అభిమానులు మాత్రమే కాదు ఇండియా వైడ్ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 285 కోట్ల భారీ బడ్జెట్ తో రాంచరణ్ నిర్మించాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 2 న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ,హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతుంది ‘సైరా’. ఇప్పటికే టీజర్, ట్రైలర్ లు సినిమా పై అంచనాల్ని అమాంతం పెంచేసాయి. ఇక ‘సైరా’ చిత్రం కచ్చితంగా చూడాలి అనడానికి ఈ 10 సంగతులు పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

1) పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో ‘సైరా నరసింహా రెడ్డి’ టైటిల్స్ పడతాయని తెలుస్తుంది. ఇక సినిమా ఎండింగ్ లో పవన్ వాయిస్ తో కన్క్లూజన్ ఉంటుందట.

2) ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం అనుష్క వాయిస్ ఓవర్ తో మొదలవుతుంది. అనుష్క ఈ చిత్రంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ గా కనిపించబోతుంది.

3) సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ‘సైరా నరసింహారెడ్డి’ టైటిల్ సాంగ్ మరో హైలెట్ అని చెప్పాలి. కచ్చితంగా ఈ పాటకి థియేటర్లలో విజిల్స్ పడటం ఖాయం అని తెలుస్తుంది.

4) వాటర్ సీక్వెన్స్ తో ఉండే ఫైట్ మరో హైలెట్ అని చెప్పాలి. ఈ ఫైట్ లో చిరంజీవి తో పాటు తమన్నా.. అలాగే వందల కొద్దీ ఫైటర్స్ ఉంటారట. విదేసీ ఫైట్ మాస్టర్స్ సారథ్యంలో ఈ ఫైట్ సీక్వెన్స్ రూపొందినట్టు తెలుస్తుంది.

5) క్లయిమాక్స్ ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా సాగుతుందట. ‘సైరా నరసింహారెడ్డి’ చెప్పే కొన్ని డైలాగులకి ‘గూజ్ బంప్స్’ రావడం ఖాయమని తెలుస్తుంది. అలాగే ప్రీ క్లయిమాక్స్ కు వచ్చే యాక్షన్ ఎపిసోడ్.. ఇండియన్ సినిమా చరిత్ర లోనే బెస్ట్ అని తెలుస్తుంది.

6) ఫస్ట్ హాఫ్ మొత్తం ‘సైరా నరసింహా రెడ్డి’ జమిందార్ గా ఉండటం ఆయన హుందా, పౌరుషం ను ఎస్టాబ్లిష్ చేసే విధంగా సాగుతుందట.

7) ఇక సెకండ్ హాఫ్ మొత్తం ప్రజల కోసం పోరాడే ఓ యోధుడిగా ‘సైరా’ పాత్ర ఉండబోతుందట. సెకండ్ హాఫ్ లోనే ఎక్కువ యుద్ధ నేపథ్యంలో సాగే ఎపిసోడ్ లు ఉంటాయని తెలుస్తుంది.

8) ‘జాతర’ నేపథ్యంలో వచ్చే పాటని కూడా వేల మంది డ్యాన్సర్లతో చిత్రీకరించారట. ఇది కూడా సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది.

9) ‘మగధీర’ ‘బాహుబలి’ హిస్టారికల్ నేపథ్యంలో సాగే చిత్రం చేయాలని మెగాస్టార్ కు ఎప్పటి నుండో ఆశగా ఉండేదట. దీంతో ‘సైరా’ చిత్రాన్ని ఆయన ఎంతో మనసు పెట్టి చేశారట. ఆయన నటన ‘నేషనల్ అవార్డు’ కొట్టే విధంగా ఉంటుందని తెలుస్తుంది.

10) నరసింహా రెడ్డి భార్యగా నయన తార కూడా అద్భుతంగా నటించిందని తెలుస్తుంది.

11) అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు పాత్రలు కూడా ‘సైరా’ కు అదనపు ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తుంది.

12) రత్నవేలు సినిమాటోగ్రఫీ కూడా మెయిన్ హైలెట్ అని చెప్పాలి. ఓ పాన్ ఇండియా సినిమాని ఎలా చూపించాలో అలా అద్భుతంగా తన కెమెరా పనితనంతో మెప్పిస్తాడని తెలుస్తుంది.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus