Animal: వైరల్ అవుతున్న ప్రముఖ నటుడి సంచలన వ్యాఖ్యలు!

గతేడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాలలో యానిమల్ (Animal) సినిమా ఒకటి. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించడంతో పాటు ఊహించని స్థాయిలో ప్రేక్షకాదరణ పొందింది. అయితే రిలీజ్ తర్వాత ఈ సినిమా విషయంలో కొంతమంది సెలబ్రిటీలు సైతం విమర్శలు చేశారు. యానిమల్ మూవీకి సీక్వెల్ కూడా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే 12th ఫెయిల్ సినిమాలో కీలక పాత్రలో నటించిన వికాస్ దివ్యకీర్తి యానిమల్ సినిమాపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

యానిమల్ మూవీ సమాజాన్ని పదేళ్లు వెనక్కు తీసుకెళ్తుందంటూ ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ సినిమాలో హీరో జంతువులా బిహేవ్ చేస్తాడని ఆయన పేర్కొన్నారు. సినిమా అంటే కొంత సామాజిక విలువ కూడా ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజల ఆర్థిక ప్రయోజనాల కోసమే పని చేస్తారా అంటూ ఒకింత ఘాటుగా ఆయన చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.

సినిమాలో ఒక సీన్ లో హీరోయిన్ త్రిప్తిని (Tripti Dimri)బూట్లు నాకమని హీరో అడుగుతాడని ఈ సన్నివేశం చూసిన తర్వాత రేపటి తరం ఇలా ప్రవర్తిస్తే ఎలా అని ఈ అసభ్యకరమైన సినిమాను చూస్తున్నందుకు బాధ వేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. వికాస్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి. యానిమల్ సినిమా నటుల నటించి, డైరెక్టర్ నుంచి ఈ కామెంట్లకు కౌంటర్ వస్తుందేమో చూడాల్సి ఉంది.

యానిమల్ సినిమాను విమర్శించి పాపులర్ అవ్వాలని కొందరు సెలబ్రిటీలు ప్రయత్నిస్తున్నారని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. యానిమల్ సినిమా సక్సెస్ ను ఓర్వలేక ఈ సినిమాపై ఈ రేంజ్ లో విషం కక్కుతున్నారని కొంతమంది ఫ్యాన్స్ చెబుతున్నారు. యానిమల్ సినిమాపై భవిష్యత్తులో కూడా విమర్శలు కొనసాగే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus