ఈ మధ్య కాలంలో ఓటీటీలో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలలో 12th ఫెయిల్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో మేధా శంకర్ హీరోయిన్ గా నటించి తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మేధా శంకర్ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. నా లైఫ్ లో 2020 ఎంతో కష్టంగా గడిచిందని ఆమె అన్నారు.
2020 సంవత్సరంలో నేను పూర్తిగా మా నాన్నపై ఆధారపడి జీవనం సాగించానని మేధా శంకర్ పేర్కొన్నారు. ఆ సమయంలో నాన్న వల్లే నేను ముంబైలో బ్రతకగలిగానని ఆమె చెప్పుకొచ్చారు. నాన్నతో కలిసి ఉండకపోతే అక్కడ అద్దె కట్టేదాన్నే కాదని కడుపు నిండా తినే దాన్నే కాదని ఆమె పేర్కొన్నారు. 2020 సంవత్సరంలో నాకు చాలా మూవీ ఆఫర్లు వచ్చాయని మేధా శంకర్ అన్నారు.
నా యాక్టింగ్ నచ్చి కొన్ని వెబ్ సిరీస్ లకు హీరోయిన్ గా నన్ను ఎంపిక చేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. అలా వరుసగా మూడు భారీ ప్రాజెక్ట్ లలో ఆఫర్స్ వచ్చాయని ఆమె తెలిపారు. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ లలో నన్ను తొలగించి మరొకరిని తీసుకున్నారని మేధా శంకర్ అన్నారు. ఈ నమ్మకద్రోహాలను నేను భరించలేకపోయానని మూడుసార్లు ఇదే విధంగా జరగడంతో కుంగిపోయానని ఆమె తెలిపారు.
ఐ.ఆర్.ఎస్ అధికారిణి శ్రద్ధా జోషి పాత్రలో 12th ఫెయిల్ సినిమాలో మేధా శంకర్ నటించారు. ఈ సినిమా సక్సెస్ తో రాబోయే రోజుల్లో శ్రద్ధా జోషి కెరీర్ పరంగా మరింత బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మేధా శంకర్ నటనకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. మేధా శంకర్ కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మేధా శంకర్ ను (Medha Shankar) అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!