Bigg Boss 7 Telugu: 13వ వారం నామినేషన్ లిస్ట్ ఇదే..! కెప్టెన్ అవ్వకపోయినా అమర్ కి అది దక్కింది..!

బిగ్ బాస్ హౌస్ లో 13వ వారం నామినేషన్స్ హైలెట్ గా జరిగాయ్. యాక్టివిటీ రూమ్ లో నరకం సెటప్ వేసిన బిగ్ బాస్ నామినేట్ చేయాలని అనుకునేవారికి రంగు పూసి మరీ నామినేట్ చేయమని చెప్పాడు. ఇక్కడే పెద్ద మాటల యుద్ధం జరిగింది. పల్లవి ప్రసాంత్ బ్లాంకెట్స్ కోసం ప్రియాంకని ఇంకా శోభని నిలదీశాడు. దీంతో ఈ ఇష్యూ చాలా పెద్దగా అయ్యింది. ఆ తర్వాత ప్రియాంక సైతం పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేస్తూ ఇదే రీజన్ చెప్పింది.

బ్లాకెంట్స్ విఐపి రూమ్ లో నుంచీ మావి అని చెప్పి కప్పుకుంటానికి తెచ్చుకున్నారని, ఇంట్లో మీకో రూల్, మాకో రూల్ ఉందా అంటూ పల్లవి ప్రశాంత్ సీరియల్ బ్యాచ్ ని నిలదీశాడు. దీనికి వాళ్లు ఎక్స్ ప్లనేషన్ ఇస్తూ ఇందులో నీకు వచ్చిన ప్రాబ్లమ్ ఏంటని అడిగారు. రూల్స్ కి వ్యతిరేకంగా నువ్వు ఏ పనీ చేయలేదా ఇన్నిరోజుల్లో అంటూ ప్రియాంక రెచ్చిపోయింది. బ్లాకెంట్స్ గురించి మాట్లాడుతుంటే సిగ్గుపోతోందని, నిజానికి మేము బిగ్ బాస్ ని అడిగి, కెప్టెన్ పర్మీషన్ తోనే చేశామని ప్రశాంత్ కి క్లారిటీ ఇచ్చారు.

ఇక్కడ మీకో రూల్ – మాకో రూల్ ఉందా అంటూ పల్లవి ప్రశాంత్ వారికి జరిగిన అన్యాయం గురించి వివరణ ఇచ్చాడు. ఇక దీనిపైనే చాలాసేపు నామినేషన్స్ జరిగాయి. ఇందులో ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే.,పల్లవి ప్రశాంత్ శోభాని అలాగే ప్రియాంకని ఇద్దరినీ నామినేట్ చేశాడు. అలాగే ప్రియాంక శివాజీని ఇంకా పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసింది. అర్జున్ శివాజీని ఇంకా ప్రియాంకని నామినేట్ చేశాడు. గౌతమ్ శివాజీని ఇంకా పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేశాడు.

ఇక్కడే శివాజీని పాత విషయాలు అన్నీ అడిగాడు. మిగతా వాళ్లతో ఉన్నట్లుగా ఉండరనే పాయింట్స్ ని మళ్లీ తెచ్చాడు. అంతేకాదు, అర్జున్ సైతం శివాజీని తన విషయంలో కడిగిపారేశాడు. దీంతో శివాజీ బాగా హర్ట్ అయ్యాడు. హౌస్ మేట్స్ అందరూ శివాజీనే టార్గెట్ చేశారు. నామినేషన్స్ లో బ్రేక్ తర్వాత కూడా కొన్ని పాయింట్స్ ని డిస్కస్ చేశారు. ఆ తర్వాత నామినేషన్స్ ప్రక్రియ తిరిగి కొనసాగింది. ఇక్కడ శోభాశెట్టి యావర్ ని ప్రశాంత్ ని నామినేట్ చేసింది. ప్రసాంత్ ని అయితే నిలదీసింది.

తనని మాట్లాడకుండా , పాయింట్స్ చెప్పనివ్వకుండా రంగు పూసి మరీ వెళ్లి కూర్చుంది. ఆ తర్వాత అమర్ గౌతమ్ ని ఇంకా పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేశాడు. అమర్ పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేస్తుంటే పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు ఫస్ట్ టైమ్ నామినేషన్స్ లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత శివాజీ గౌతమ్ ని నామినేట్ చేశాడు. ఇలా ప్రతి ఒక్కరూ నామినేషన్స్ లో తమ పవర్ ని చూపించారు.

అంతేకాదు, సీరియల్ బ్యాచ్ – శివాజీ బ్యాచ్ ని శివాజీ బ్యాచ్ సీరియల్ బ్యాచ్ ని నామినేట్ చేసుకున్నారు. ఈసారి అమర్ తప్ప అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. అమర్ కెప్టెన్ అవ్వకపోయినా సరే ఇమ్యూనిటీ ఈరూపంలో వచ్చింది. నిజానికి ఈవారం (Bigg Boss 7 Telugu) కెప్టెన్సీ కోసం అమర్ బాగా పైట్ చేసిన సంగతి తెలిసిందే. అదీ మేటర్.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus