Rc15: ఒక్క పాట కోసం పదిహేను కోట్ల ఖర్చు!

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శంకర్ తనదైన స్టైల్ లో కొన్ని పాటలను చిత్రీకరించబోతున్నారు. ఆయన సినిమాలన్నీ చాలా గ్రాండ్ గా ఉంటాయి. ముఖ్యంగా పాటల కోసం కోట్లు ఖర్చు చేస్తుంటారు.

‘అపరిచితుడు’, ‘శివాజీ’, ‘రోబో’ లాంటి సినిమాల్లో పాటలను ఎంత భారీగా తీశారో తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ తో తీస్తున్న సినిమాలో కూడా సాంగ్స్ లో తన మార్క్ చూపించాలనుకుంటున్నారు శంకర్. ఇందులో ఒక్క పాటకే రూ.15 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 20 నుంచి రెండు వారాల పాటు న్యూజిలాండ్ లో ఈ పాటను చిత్రీకరించబోతున్నారు.

దీనికోసం హీరో, హీరోయిన్లు రామ్ చరణ్, కియారా అద్వానీలతో పాటు టీమ్ మొత్తం న్యూజిలాండ్ కి పయనమవనుంది. అక్కడ భారీ లొకేషన్స్ లో వందలమంది డాన్సర్స్ మధ్య ఈ పాటను చిత్రీకరించబోతున్నారు. ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ తో కలిసి శంకర్ ఈ పాటను గ్రాండ్ గా డిజైన్ చేశారట. ఒక్క పాట మీద రూ.15 కోటీలంటే.. అది ఎంత భారీగా ఉంటుందో అంచనా వేయొచ్చు.

మరి తెరపై ఆ పాట ఎంత అద్భుతంగా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, సునీల్ లాంటి నటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎస్ జె సూర్య విలన్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది చివర్లో లేదా 2024 ఆరంభంలో విడుదల చేయనున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus