హీరో క్రేజ్ ఆధారంగానే బిజినెస్ జరుగుతుంది కాబట్టి.. రచయితలు హీరోని ఫోకస్ చేస్తూనే కథలు రాస్తుంటారు. అరుదుగా హీరోయిన్స్ కి ప్రాధాన్యమున్న కథలు పుడుతుంటాయి. ఆ కథల్లో మన కథానాయికలు అద్భుతంగా నటించి అందరి అభినందనలు అందుకున్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలను సైతం ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించారు. ఇలా తెలుగులో వచ్చిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలపై ఫోకస్..
1. విజయశాంతి (కర్తవ్యం) ఎ. మోహన గాంధీ దర్శకత్వంలో సూర్య మూవీస్ పతాకంపై ఎ. ఎం. రత్నం నిర్మించిన చిత్రం కర్తవ్యం. 1990 లో వచ్చిన ఈ సినిమాలో విజయశాంతి ఓ నిజాయితీ గల పోలీసు అధికారిణిగా అదరగొట్టారు.
2. సుధా చంద్రన్ (మయూరి) భరతనాట్య నృత్యకారిణి సుధా చంద్రన్ 1981 జూన్ నెలలో తమిళనాడు లోని “త్రిచీ” వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయింది. అయినప్పటికీ కృత్రిమ కాలుతో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె జీవితాన్ని సింగీతం శ్రీనివాసరావు మయూరి గా తెరకెక్కించారు. అందులో సుధా చంద్రన్ నటించడం విశేషం.
3. విజయశాంతి (ప్రతిఘటన) టి. కృష్ణ దర్శకత్వంలో 1986 లో విడుదలైన సినిమా ప్రతిఘటన. ఇందులో విజయశాంతి, చంద్రమోహన్, రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషించారు. అయిన విజయశాంతి చుట్టూ కథ నడుస్తుంది. ఈ మూవీ మహిళలను విశేషంగా ఆకట్టుకుంది.
4. అనుష్క (అరుంధతి)లేడీ ఓరియెంటెడ్ సినిమాలు స్టార్ హీరోల సినిమాల మాదిరిగా కలక్షన్స్ వసూలు చేయగలుగుతాయని నిరూపించిన సినిమా అరుంధతి. అనుష్క డ్యూయల్ రోల్ పోషించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
5. జీవిత (అంకుశం) కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలై సంచలన విజయం సాధించిన తెలుగు సినిమా అంకుశం. రాజశేఖర్, జీవిత నటించిన ఈ చిత్రంలో జీవిత పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
6. నయనతార (మయూరి)హారర్ జోనర్ లో తెరకెక్కిన మయూరి సంచలన విజయం సాధించింది. లో బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నయనతార చక్కగా నటించింది.
7. అనుష్క (రుద్రమదేవి) వీరనారి రుద్రమదేవి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అనుష్క తన నటనతో విజయ తీరం చేర్పించారు.
8. నయనతార (అనామిక) హిందీలో హిట్ సాధించిన కహానీ చిత్రం ఆధారంగా తెలుగులో రూపుదిద్దుకున్న మూవీ అనామిక. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నయనతార అనామిక గా అలరించారు.
9. అనుష్క (పంచాక్షరీ)అనుష్క రెండో సారి డ్యూయల్ రోల్ పోషించిన మూవీ పంచాక్షరీ. దర్శకుడు సముద్ర అనుష్క పాత్రల చుట్టూ సన్నివేశాలను తెరకెక్కించినప్పటికీ హిట్ సాధించలేకపోయింది.
10. అంజలి (గీతాంజలి) 2014 లో విడుదలయిన గీతాంజలి లో హీరోగా ప్రముఖ హాస్య నటుడు శ్రీనివాస్ రెడ్డి నటించారు. అయితే టైటిల్ రోల్ పోషించిన అంజలి ఈ చిత్రాన్ని ఒంటి చేత్తో హిట్ చేయించింది.
11. లక్ష్మి మంచు (దొంగాట) మంచు లక్ష్మి నటించి నిర్మించిన మూవీ దొంగాట. వంశీకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాని మంచు లక్ష్మి చుట్టూ కథ సాగుతుంది.
12. ఛార్మి (అనుకోకుండా ఒక రోజు) థ్రిల్లర్ జోనర్ లో 2005లో విడుదలైన సినిమా అనుకోకుండా ఒక రోజు. ఒక అమ్మాయి లైఫ్ లో అనుకోకుండా ఒకరోజు జరిగిన సంఘటన ఎన్ని మలుపులు తిప్పిందో చంద్రశేఖర్ యేలేటి చాలా ఆసక్తికరంగా చూపించారు.
13. జెనీలియా (కథ) బబ్లీ గర్ల్ జెనీలియా తనకి సూటయ్యే కథలనే ఎంచుకొని హిట్ కొట్టింది. అయితే లేడీ ఓరియెంటెడ్ స్టోరీ అయిన “కథ” అనే సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
14. మంజుల ఘట్టమనేని (షో) షో సినిమాలో మంజుల అద్భుతంగా నటించి సూపర్ స్టార్ కృష్ణ కూతురిగా నిరూపించుకుంది. తక్కువ పాత్రలు, అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అవార్డులను సొంతం చేసుకుంది.
15 . అనుష్క (భాగమతి) అరుంధతి. భాగమతి.. ఈ పాత్రలు అనుష్కకోసమే పుట్టినట్లు ఉన్నాయి. ఈ పాత్రలకు అనుష్క ప్రాణం పోశారు. అశోక్ డైరక్షన్లో తెరకెక్కిన భాగమతి భారీ కలక్షన్స్ రాబట్టి అనుష్కకు హీరోతో సమానమైన పేరును తెచ్చిపెట్టింది.
16. నయనతార (కర్తవ్యం) లేడి అమితాబ్ విజయశాంతి నటించిన కర్తవ్యం సినిమా టైటిల్‌తో నయనతార చేసిన సినిమా మంచి హిట్ అందుకుంది. ఇందులో నయనతార కలెక్టర్ గా నట విశ్వరూపం ప్రదర్శించింది.
ఇంకా మేము మిస్ అయిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఉంటే కామెంట్ చేయండి.