Manamey: ‘మనమే’ టీమ్‌ రిస్క్‌ చేస్తోందా? ఈ టైమ్‌లో అన్ని పాటలంటే!

  • June 4, 2024 / 08:20 PM IST

ఐదు నిమిషాల పాట, ఆరు నిమిషాల పాటతో తెలుగు సినిమా ఒకప్పుడు వెలిగిపోయేది. మూడేసి, నాలుగేసి చరణాలు ఉన్న పాటల్ని ఎంజాయ్‌ చేసిన తెలుగు ప్రేక్షకుడు ఇప్పుడు మూడున్నర నిమిషాలు, మూడు నిమిషాల పాటలే వింటున్నాడు. పెద్ద పెద్ద సినిమాలు తగ్గినట్లే పెద్ద పెద్ద పాటలూ తగ్గాయి. పనిలో పనిగా మూడు ఫైట్లు.. ఆరు పాటలు అనే కాన్సెప్ట్‌ కూడా ఇప్పుడు తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. ఇప్పుడు ఈ టాపిక్‌ గురించి చర్చ ఎందుకు అనుకుంటున్నారా? తెలుగులో త్వరలో రాబోతున్న ఓ సినిమాలో ఐదు కాదు, ఆరు కాదు ఏకంగా 16 పాటలు ఉన్నాయి అంటున్నారు.

ఈ మేరకు చిత్ర దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య(Sriram Adittya)  చెప్పుకొచ్చారు. ‘మనమే’ (Manamey) సినిమాలో మొత్తం 16 పాటలు ఉన్నాయని, అవి ప్రేక్షకుల్ని అలరిస్తాయని చెప్పారు. అయితే ఇందులో మేజర్‌ పార్ట్‌ బిట్‌ సాంగ్స్‌ అని అంటున్నారు. అయితే ఈ మాట ఆయన చెప్పలేదు. బిట్‌ సాంగ్స్‌ అయినా.. ఈ రోజుల్లో ఇన్నేసి పాటలు ఓ సినిమాలు చూడటం అరుదే. అయితే ఆ పాటలన్నీ సినిమా కథ, కథనంలో భాగంగానే వస్తాయి అని చెబుతున్నారు టీమ్‌. మరి ఆ పదహారు పాటలు ఏంటి? ఎలా ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారింది.

మ్యూజిక్ సెన్సేషన్‌ హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ ఈ పాటలు అందించిన విషయం తెలిసిందే. ఆయన పాటలు ఎంత విన్నా వినాలని అనిపిస్తుంటుంది. మరి 16 పాటల సినిమాను ఎలా మలిచారో చూడాలి. ఇక సినిమా సంగతి చూస్తే.. శర్వానంద్‌ – కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో రూపొందిన రొమాంటిక్‌ కామెడీ జోనర్‌ సినిమా ఇది. జూన్‌ 7న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ మీద రూపొందిన ఈ సినిమా మీద నిర్మాణ సంస్థతోపాటు శర్వానంద్‌ (Sharwanand), కృతి (Krithi Shetty) , శ్రీరామ్‌ ఆదిత్య భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ నలుగురికి ఈ విజయం చాలా అవసరం అని చెప్పొచ్చు. మరి ప్రేక్షకులు ఎలాంటి ఫలితం ఇస్తారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus