17 ఏళ్ళలో ఎంత ఎదిగిపోయాడు..!

  • November 11, 2019 / 12:24 PM IST

పెదనాన్న రిఫరెన్స్ తో ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు. అయితే అప్పటికి ఆయన హవా తగ్గిపోయింది కాబట్టి ఆ రిఫరెన్స్ ఎంట్రీ వరకే ఉపయోగపడింది తప్ప స్టార్ హీరో ఇమేజ్ తెచ్చేంతలా అది పెద్ద ఉపయోగపడలేదనే చెప్పాలి. కానీ అంచలంచలుగా ఎదిగి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆయన ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదుగా.. ఆయనే మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన ‘ఈశ్వర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 2002 నవంబర్ 11 న ఆ చిత్రం విడుదలైంది. కాబట్టి ఈరోజుతో ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు పూర్తయింది. ఇక మొదటి చిత్రంతో పర్వాలేదని అనిపించినా మంచి హిట్ అందుకోవడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది. రెండో సినిమా ‘రాఘవేంద్ర’ సినిమా కూడా పెద్దగా ఆడలేదు.

కానీ ఓ మాస్ హీరో.. యాక్షన్ హీరో.. స్టార్ హీరోకి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ప్రభాస్ లో ఉన్నాయని ఈ చిత్రం ప్రూవ్ చెసింది. కచ్చితంగా ప్రభాస్ కు ఓ హిట్ అవసరం అనుకున్న తరుణంలో ‘వర్షం’ సినిమా ఆలోటుని తీర్చేసింది. ఇక ‘అడవిరాముడు’ ‘చక్రం’ సినిమాలు ఆడకపోయినా.. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమా మాత్రం ప్రభాస్ కు కావాల్సిన మాస్ ఇమేజ్ ను తీసుకొచ్చింది. ప్లాపులు వచ్చినా ఏమాత్రం డిజప్పాయింట్ అవ్వకుండా ‘డార్లింగ్’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ‘మిర్చి’ వంటి చిత్రాలతో హిట్లు కొట్టి స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ‘బాహుబలి’ సిరీస్ తో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రభాస్ బాలీవుడ్ లో కూడా స్టార్ హీరో అని ‘సాహో’ చిత్రం ప్రూవ్ చేసింది. ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో తన 20 వ చిత్రం చేస్తూ ప్రభాస్ చాలా బిజీగా గడుపుతున్నాడు.

ఇక ప్రభాస్ 17 ఏళ్ళ సినీ ప్రయాణాన్ని ఓ లుక్ ఎద్దాం రండి :

1) ఈశ్వర్(2002)

2) రాఘవేంద్ర(2003)

3) వర్షం (2004)

4) అడవి రాముడు(2004)

5)చక్రం (2005)

6)ఛత్రపతి (2005)

7)పౌర్ణమి (2006)

8) యోగి (2007)

9)మున్నా (2007)

10) బుజ్జిగాడు (2008)

11) బిల్లా (2009)

12) ఏక్ నిరంజన్ (2009)

13) డార్లింగ్ (2010)

14) మిస్టర్ పర్ఫెక్ట్ (2011)

15) రెబల్ (2012)

16)మిర్చి (2013)

17) బాహుబలి ‘ది బిగినింగ్’ (2015)

18) బాహుబలి 2 (2017)

19) సాహో (2019)

ప్రభాస్ గెస్ట్ రోల్ ఇచ్చిన సినిమా : యాక్షన్ జాక్సన్ (హిందీ)

రాజమౌళి సొంత బ్యానర్ అయిన ‘విశ్వామిత్ర క్రియేషన్స్’ పై ‘యమదొంగ’ చిత్రాన్ని నిర్మించాడు. ఆ సంస్థ లోగో పై ఉండేది కూడా ప్రభాసే..!

తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus