‘జీఏ 2 పిక్చర్స్’ , ‘సుకుమార్ రైటింగ్స్’ నిర్మాణంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ’18 పేజెస్’. బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ‘కార్తికేయ2’ వంటి పాన్ ఇండియా హిట్ మూవీ తర్వాత నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్లో వస్తున్న మూవీ ఇది. ‘కుమారి 21ఎఫ్’ వంటి సూపర్ హిట్ తర్వాత సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ కొంత గ్యాప్ తీసుకుని డైరెక్ట్ చేసిన మూవీ కూడా.!
డిసెంబర్ 23న రిలీజ్ అయిన ఈ మూవీకి… మొదటి రోజు పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ జస్ట్ యావరేజ్ గా నమోదయ్యాయి. అలా అని వీక్ డేస్ లో డ్రాప్ అయ్యింది లేదు.స్టడీగానే చేసింది. మొదటి వారం పర్వాలేదు అనిపించిన ఈ మూవీ 8 వ రోజు కూడా ఓకే అనిపించింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 3.54 cr |
సీడెడ్ | 0.65 cr |
ఉత్తరాంధ్ర | 0.73 cr |
ఈస్ట్ | 0.48 cr |
వెస్ట్ | 0.26 cr |
గుంటూరు | 0.32 cr |
కృష్ణా | 0.26 cr |
నెల్లూరు | 0.18 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 6.42 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.64 cr |
ఓవర్సీస్ | 1.26 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 8.32 cr (షేర్) |
’18 పేజెస్’ చిత్రానికి రూ.12.59 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.13 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.8.32 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.4.68 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకుంటే.. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!
ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?