2012 సంవత్సరంలో విడుదలై, ప్రేక్షకులతో జేజేలు అందుకున్న తెలుగు సినిమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం నంది అవార్డులను ప్రకటించింది. సహజ నటి జయసుధ ఆద్వర్యంలోని అవార్డుల ఎంపిక కమిటీ 24 క్రాఫ్ట్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసింది. 2012 నంది అవార్డు గ్రహీతలు వీరే..
ఉత్తమ చిత్రం : ఈగ
రెండో ఉత్తమ చిత్రం : మిణుగురులు
మూడో ఉత్తమ చిత్రం : మిథునం
ఉత్తమ దర్శకుడు : ఎస్.ఎస్.రాజమౌళి (ఈగ)
ఉత్తమ కథానాయకుడు : నాని (ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ కథానాయిక : సమంత (ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ సహాయనటుడు : అజయ్(ఇష్క్)
ఉత్తమ సహాయనటి : శ్యామల (వీరంగం)
ఉత్తమ జనరంజకమైన సినిమా : జులాయి
ఉత్తమ గాయకుడు : శంకర్ మహాదేవన్
ఉత్తమ గాయని : గీతామాధురి
ఉత్తమ సంగీత దర్శకులు : కీరవాణి(ఈగ), ఇళయరాజా(ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ ఆడియోగ్రాఫర్ : కడియాల దేవి కృష్ణ (ఈగ)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ : మకుట (ఈగ)
ఉత్తమ మాటల రచయిత : తనికెళ్ళ భరణి(మిథునం)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ : తిరుమల (కృష్ణం వందే జగద్గురం)
ఉత్తమ ఫైట్ మాస్టర్ : గణేష్ (ఒక్కడినే)
స్పెషల్ జ్యూరీ
ఉత్తమ నటుడు : బాల సుబ్రహ్మణ్యం
ఉత్తమ నటి : లక్ష్మీ
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.