2018 Movie Collections: వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించి.. హిట్ లిస్ట్ లో చేరిపోయింది.!

కేరళలో ఇండస్ట్రీ హిట్‌గా ఉన్న మోహన్ లాల్ ‘పులి మురుగన్’ కలెక్షన్స్ ను బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ‘2018’. టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, మరియు జాయ్ మాథ్యూ, సుధీష్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.జూడ్ ఆంథోనీ జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మే 5న మలయాళంలో రిలీజ్ అయ్యింది.

తెలుగు వెర్షన్ నిన్న అంటే మే 26న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా రిలీజ్ అయ్యింది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. తెలుగు వెర్షన్ కు సంబంధించి ప్రీమియర్ షోస్ హైదరాబాద్, వైజాగ్,విజయవాడలో వేయడం జరిగింది. వాటికి సూపర్ రెస్పాన్స్ లభించింది. తొలి రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ బాగానే నమోదయ్యాయి. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.88 cr
సీడెడ్ 0.36 cr
ఆంధ్ర 0.79 cr
ఏపీ+ తెలంగాణ టోటల్ 2.03 cr

‘2018’ (2018 Movie) చిత్రం తెలుగు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.1.7 కోట్లు. మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.2.03 కోట్లు కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది. ఆల్రెడీ రూ.0.33 కోట్లు ప్రాఫిట్ అందించిన ఈ మూవీ రానున్న రోజుల్లో మరింతగా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus