2021 తొలి సినిమా.. ఆఖరి సినిమా ఏవో తెలుసా?

మరికొద్ది రోజుల్లో 2021 ముగుస్తోంది. కరోనా పుణ్యమా అని ఈ ఏడాది కూడా సినిమా పరిశ్రమ అరకొర ఆనందంతోనే సరిపెట్టుకుంది. ఏడాది ప్రథమార్ధంలో వరుస విజయాలు అందుకున్న పరిశ్రమ, మళ్లీ ఏడాది ఆఖరి నెలలో ఆ స్థాయి విజయాలను రుచి చూసింది. అయితే ఈ సినిమా ఏడాదిలో వచ్చిన తొలి సినిమా ఏది, రాబోతున్న ఆఖరి సినిమా ఏదో తెలుసా? దాని గురించి ఈ వార్త. తొలి సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. ఇండస్ట్రీకి ఓ ఊపు తెచ్చింది. మరి ఆఖరి సినిమా ఏమవుతుందో చూడాలి. ఇక విషయంలోకి వెళ్తే…

2021 సినిమా ఉత్సవం రవితేజ ‘క్రాక్‌’ సినిమాతో మొదలైంది. జనవరి 9న ఈ సినిమాను విడుదల చేశారు. కరోనా పరిస్థితులు అప్పుడప్పుడే సద్దుమణుగుతున్న రోజులు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించిన ఆ సినిమాకు మంచి బజ్‌ వచ్చింది. కానీ విడుదల విషయంలో కొన్ని బాలారిష్టాలు ఎదుర్కొంది. అయితే పెద్దల సహకారంతో సినిమాను విడుదల చేశారు. సినిమా బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లు సాధించింది. అలాగే మిగిలిన వాళ్లకు ధైర్యం ఇచ్చింది అని చెప్పొచ్చు.

రవితేజకు అచ్చొచ్చిన పోలీసు నేపథ్యంలో సాగే కథ ఇది. ఆ మాస్‌ మేనరిజం, ఎలివేషన్లు, కంటెంట్‌కి ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. ఇక ఆఖరి సినిమా గురించి వద్దాం. ఈ ఏడాది రాబోయే ఆఖరి సినిమా ‘అర్జున ఫల్గుణ’. శ్రీవిష్ణు హీరోగా రూపొందిన సినిమా ఇది. తేజ మర్ని అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను డిసెంబరు 31న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది.దీంతో ఈ సినిమానే 2021 ఆఖరి చిత్రం అవుతుంది.

గోదావరి జిల్లాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. గంజాయి అక్రమ రవాణా నేపథ్యంలో సినిమా తెరకెక్కించారట. అనుకోకుండా అక్రమ రవాణా ఉచ్చులో చిక్కుకున్న హీరో ఆ తర్వాత ఏం చేశాడు అనేదే కథ అంటున్నారు. ఇక కొత్త ఏడాదిని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మొదలుపెడుతుంది. రాజమౌళి నుండి వస్తున్న మరో రత్నంగా ఈ సినిమాను అందరూ కొనియాడుతున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందుతున్న ఈ సినిమా కొత్త సంవత్సరాన్ని ఎలా ప్రారంభిస్తుందో చూడాలి.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus