సాధారణంగా సంక్రాంతి పండుగ సమయంలో రెండు పెద్ద హీరోల సినిమాలు రిలీజైతే ఎలాంటి సమస్య ఉండదు. అయితే 2022 సంక్రాంతికి మాత్రం ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఆర్ఆర్ఆర్ లో తారక్ తో కలిసి మెగా హీరో రామ్ చరణ్ నటిస్తుండగా భీమ్లా నాయక్ లో మెగా హీరో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఇద్దరు మెగా హీరోల సినిమాలు కేవలం 5 రోజుల గ్యాప్ లో రిలీజవుతూ ఉండటం గమనార్హం.
సంక్రాంతికి మూడు సినిమాల పోటీ వల్ల ఈ మూడు సినిమాలలో నెగిటివ్ టాక్ వచ్చిన సినిమా మాత్రం భారీ మొత్తంలో నష్టపోక తప్పదు. ఆర్ఆర్ఆర్ మూవీ బడ్జెట్ 550 కోట్ల రూపాయలు కాగా రాధేశ్యామ్ బడ్జెట్ 300 కోట్ల రూపాయలు, భీమ్లా నాయక్ బడ్జెట్ 150 కోట్ల రూపాయలు అని సమాచారం. ఈ మూడు సినిమాలలో ఏ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే ఆ సినిమా థియేటర్లలో వీకెండ్ తర్వాత పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా ప్రదర్శితమయ్యే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో తక్కువ సంఖ్యలో థియేటర్లు ఉండటం, ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉండటంతో మూడు సినిమాలకు థియేటర్ల పరంగా సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంది. మూడు భారీ సినిమాలు సంక్రాంతికి ఫిక్స్ కావడంతో సంక్రాంతి రేసులో మరో సినిమా నిలిచే అవకాశాలు దాదాపుగా లేనట్టేనని బోగట్టా. సంక్రాంతి సమయానికి ఈ మూడు సినిమాలలో ఒక సినిమా వెనక్కు తగ్గితే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు మేలు జరిగే ఛాన్స్ ఉంది.
2022 సంక్రాంతి పండుగకు రిలీజయ్యే సినిమాలలో ఏ సినిమా విజేతగా నిలుస్తుందో ఏ సినిమా నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను అందిస్తుందో చూడాల్సి ఉంది. ఈ ఏడాది దసరాకు మహాసముద్రం, పెళ్లిసందడి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రిలీజ్ కాగా మహాసముద్రంకు ఫ్లాప్ టాక్ రావడంతో ఆ సినిమా నష్టపోవడంతో పాటు వీకెండ్ తర్వాత ఆ సినిమా థియేటర్లను ఇతర సినిమాలకు కేటాయించారు. దసరా ఫలితమే 2022 సంక్రాంతికి రిపీట్ అవుతుందని కొంతమంది నెటిజన్లు భావిస్తున్నారు.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!