Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీలో విడుదల కాబోతున్న 21 సినిమాలు ఇవే..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి, సమ్మర్ తర్వాత దసరా, దీపావళి బిగ్గెస్ట్ సీజన్.. వందల కోట్ల రూపాయల బిజినెస్ జరిగే ఈ ఫెస్టివల్ టైంలో.. స్టార్ హీరోల సినిమాలు పోటా పోటీగా బరిలో దిగుతుంటాయి. దివాళీకి వచ్చిన ‘సర్దార్’, ‘ఓరి దేవుడా’, ‘ప్రిన్స్’, ‘జిన్నా’ సినిమాలు సో సోగా ఆడుతున్నాయి. కన్నడ సెన్సేషన్ ‘కాంతార’ రెండో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మరి ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీలో రాబోతున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, డైరెక్టర్ అభిషేక్ శర్మ కాంబినేషన్ లో రామసేతు ఆధారంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ‘రామ్ సేతు‘.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫీమేల్ లీడ్ కాగా టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సత్య దేవ్ ఈ సినిమాతో హిందీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. అక్టోబర్ 25న హిందీ, తెలుగు భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది..

అజయ్ దేవ్ గణ్, సిద్దార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘థ్యాంక్ గాడ్’.. ఇంద్ర కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కూడా అక్టోబర్ 25నే థియేటర్లలోకి వస్తోంది..

శ్రీకాంత్, బుజ్జి హీరో హీరోయిన్లుగా నటించిన సరికొత్త ప్రేమకథా చిత్రం ‘నిన్నే చూస్తు’.. కె. గోవర్ధన రావు దర్శకత్వంలో రూపొందిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ అక్టోబర్ 27న విడుదల కానుంది..

నటకిరీటి, డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో, సీనియర్ నటుడు నరసింహ రాజు కీలకపాత్రలో నటించగా.. వెంకటేష్ పెద్దిరెడ్ల దర్శకుడిగా పరిచయమవుతున్న ‘అనుకోని ప్రయాణం’ అక్టోబర్ 28న రిలీజ్ అవుతోంది..

మెగాస్టార్ చిరంజీవి క్లాసిక్ ఫిలిం ‘రుద్రవీణ’ పేరుతో.. జి. మధు సూదన్ రెడ్డి దర్శకత్వంలో.. శ్రీరామ్, ఎల్సా ఘోష్, సోనియా సత్య, సంగీత దర్శకుడు రఘు కుంచె నటించిన‘రుద్రవీణ’ సినిమా అక్టోబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది..

సీనియర్ నటి సుహాసిని, భాను చందర్, షాయాజీ షిండే కీలకపాత్రల్లో నటించగా.. విజయ్ శంకర్, అషు రెడ్డి (బిగ్ బాస్ ఫేమ్) లీడ్ రోల్స్ చేసిన ‘ఫోకస్’ మూవీ అక్టోబర్ 28న రానుంది. జి.సూర్య తేజ ఈ చిత్రానికి దర్శకుడు..

వాస్తవిక సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తూ.. తనవంతు సమాజంలో మార్పు తీసుకురావాలని ప్రయత్నించే దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి ఈసారి విద్యా వ్యవస్థపై తీసిన ‘వెల్ కమ్ టు తీహార్ కాలేజ్’ మూవీ కూడా అక్టోబర్ 28నే విడుదల అవుతోంది.

ఓటీటీలో వస్తున్న సినిమాలు/వెబ్ సిరీస్ లు..

బ్లేడ్ ఆఫ్ ది రోనిన్ (హాలీవుడ్) ‌- అక్టోబర్ 25
కేబినెట్ ఆఫ్ క్యూరియాసిటీస్ (వెబ్ సిరీస్) – అక్టోబర్ 25
రాబింగ్ ముస్సోలిని (ఇటాలియన్ మూవీ) ‌‌‌‌- అక్టోబర్ 25
ద గుడ్ నర్స్ (హాలీవుడ్) – అక్టోబర్ 26
దుబాయ్ బ్లింగ్ (రియాలిటీ షో) – అక్టోబర్ 27
బియాండ్ ద యూనివర్స్ (హాలీవుడ్ మూవీ) – అక్టోబర్ 27
మర్డర్ ఇన్ ది కోర్ట్ రూమ్ (వెబ్ సిరీస్) – అక్టోబర్ 28
ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ (హాలీవుడ్) – అక్టోబర్ 28
ద బాస్టర్డ్ ఆన్ అండ్ ద డెవిల్ హిమ్ సెల్ఫ్ (వెబ్ సిరీస్) – అక్టోబర్ 28

అమెజాన్ ప్రైమ్ వీడియో

నేనే వస్తున్నా (తెలుగు) – అక్టోబర్ 27
ఫ్లేమ్స్ (హిందీ సిరీస్) – అక్టోబర్ 28

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

టేల్స్ ఆఫ్ ది జేడి (వెబ్ సిరీస్) – అక్టోబర్ 26
ఝాన్సీ (తెలుగు సిరీస్) – అక్టోబర్ 27
అప్పన్ (మలయాళం) – అక్టోబర్ 28

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus