25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ‘సొగసు చూడతరమా’

  • July 14, 2020 / 06:05 PM IST

‘రుద్రమదేవి’తో దర్శకనిర్మాతగా సంచలన విజయాన్ని సొంతం చేసుకుని ప్రస్తుతం ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘హిరణ్యకశ్యప’ ప్రారంభిస్తున్న డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శక నిర్మాతగా అందించిన ‘సొగసు చూడతరమా’ కి జులై 14 తో 25 సంవత్సరాలు పూర్తవుతుంది. నరేష్, ఇంద్రజ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అవడమే కాకుండా ప్రతిష్ఠాత్మకమైన నాలుగు నంది అవార్డులను సాధించింది. బెస్ట్ ఫిల్మ్ గా బంగారు నంది ని అందుకున్న ఈ చిత్రానికి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా గుణశేఖర్ నంది అవార్డును అందుకున్నారు.

బెస్ట్ డైలాగ్ రైటర్ నంది అవార్డు ను అజయ్ శాంతి, బెస్ట్ కాస్ట్యూమ్స్ నంది అవార్డును కుమార్ తీసుకున్నారు. ‘సొగసు చూడతరమా’ చిన్న చిత్రంగా నిర్మించినా ప్రేక్షకులు పెద్ద విజయాన్ని అందించడమే కాకుండా ఉత్తమ చిత్రం గా బంగారు నంది రావడం, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నాకు, బెస్ట్ డైలాగ్ రైటర్ గా అజయ్ శాంతి కి, కాస్ట్యూమ్స్ కి కుమార్ కు కూడా నంది రావడం ఆ సినిమా దర్శకనిర్మాత గా ఎంతో ఆనందాన్ని కలిగించింది.

ప్రేక్షకుల రివార్డ్స్ ను ప్రభుత్వ అవార్డ్స్ ను అందుకుని నా సినీ జీవితంలో అన్ని విధాలా సంతృప్తిని కలిగించి ఒక స్వీట్ మెమరీ గా నిలిచిన ‘సొగసు చూడతరమా’ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ ఆ చిత్రాన్ని సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు, అవార్డ్స్ ఇచ్చి గౌరవించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అన్నారు గుణశేఖర్.

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus