Gulabi Movie: ‘గులాబి’ కి సింగర్ సునీతకి సంబంధం ఏంటో తెలుసా!

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ 27 సంవత్సరాల కెరీర్‌లో పలు సూపర్ హిట్ సినిమాలు చేశారు.. తీసింది తక్కువ చిత్రాలే అయినా దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణవంశీ స్టైలే సపరేటు అన్నట్టుండేవి క్రియేటివిటీతో వంశీ తీసే మూవీస్.. లవ్, ఫ్యామిలీ, యాక్షన్, ఫ్యాక్షన్, థ్రిల్లర్.. ఇలాంటి జానర్లలోనూ తన మార్క్ చూపించారాయన.. రామ్ గోపాల్ వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నప్పుడే తనలోని టాలెంట్‌ని గుర్తించిన వర్మ.. దర్శకుడిగా నీ ఫస్ట్ సినిమాని నేనే నిర్మిస్తానని చెప్పారు..

ఇచ్చిన మాట ప్రకారం వర్మ క్రియేషన్స్ బ్యానర్ మీద, కృష్ణవంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ‘గులాబి’ అనే రొమాంటిక్ థ్రిల్లర్ తీశారు.. జె.డి. చక్రవర్తి, మహేశ్వరి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 1995 నవంబర్ 3న రిలీజ్ అయ్యింది. 2022 నవంబర్ 3 నాటికి 27 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటోంది.. లవ్, ఎమోషన్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ‘గులాబి’ సూపర్ హిట్ అయ్యింది. హీరో హీరోయిన్ల నేచురల్ పర్ఫార్మెన్స్,

కృష్ణవంశీ టేకింగ్, వర్మ ప్రొడక్షన్ వాల్యూస్, సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇలా ప్రతీదీ హైలెట్‌గా నిలిచాయి.. ఈ సినిమాలోని అన్ని పాటలూ సిరివెన్నెల రాశారు. దాదాపు 70 లక్షల బడ్జెట్‌తో తీసిన ‘గులాబి’ బాక్సాఫీస్ వద్ద కోట్లాది రూపాయల వసూళ్లు రాబట్టింది..సంగీత దర్శకుడిగా శశి ప్రీతమ్, గాయనిగా సునీత పరిచయమయ్యారు.. ‘ఈ వేళలో నీవు.. ఏం చేస్తుఉంటావు’.. పాట ఆమెకి ఎంతో పేరు తెచ్చిపెట్టింది.. సునీత సింగింగ్ కెరీర్‌లో ఆమె పాడిన ఈ తొలిపాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్..

చాలామందికిది ఫేవరెట్ సాంగ్.. కృష్ణవంశీతో పాటు సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ ‘గులాబి’ బిగ్ బ్రేక్ ఇచ్చింది.. బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి సరైన సాంగ్స్ యాడ్ అయితే దాని రెస్పాన్స్ ‘గులాబి’ ఆడియోలా ఉంటుంది అనే రేంజ్‌లో పాటలు మారుమోగిపోయాయి.. బెస్ట్ ఆడియోగ్రాఫర్ కేటగిరీలో పి.మధుసూదన్ రెడ్డికి నంది అవార్డ్ వచ్చింది.. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న ‘గులాబి’ మూవీ.. అప్పట్లో వచ్చిన ప్రేమకథా చిత్రాల్లో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది..

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus