Mahesh Babu, Pawan Kalyan: ఆ సెంటిమెంట్ పవన్, మహేష్ లకు కలిసొస్తుందా?

స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 29వ సినిమా అయిన ఆర్ఆర్ఆర్ తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 1100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ నెల 20వ తేదీనుంచి ఓటీటీలో ఆర్ఆర్ఆర్ స్ట్రీమింగ్ కానుంది. ఆర్ఆర్ఆర్ ఓటీటీలో కూడా సంచలన రికార్డులను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని అభిమానులు భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ఓటీటీ వెర్షన్ కోసం చరణ్, తారక్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు పవన్, మహేష్ కూడా త్వరలో వేర్వేరుగా 29వ సినిమాలో నటించనున్నారు. మహేష్ 28వ సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కనుండగా మహేష్ 29వ సినిమా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కనుంది. మహేష్ భవిష్యత్తు సినిమాల ప్లానింగ్ విషయంలో దాదాపుగా మార్పు లేదని సమాచారం అందుతోంది. అయితే పవన్ 29వ సినిమా గురించి మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ 28వ సినిమాగా హరిహర వీరమల్లు తెరకెక్కుతోంది.

పవన్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాతో పాటు తెరి రీమేక్ కు, వినోదాయ సిత్తం రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ మూడు సినిమాలలో ఏ సినిమా మొదట మొదలవుతుందనే ప్రశ్నకు క్లారిటీ రావాల్సి ఉంది. అయితే నంబర్ సెంటిమెంట్ పవన్ కు కలిసొస్తే పవన్ కూడా 29వ సినిమాతో సంచలనాలు సృష్టిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భవదీయుడు భగత్ సింగ్ సినిమా పవన్ 29వ సినిమాగా తెరకెక్కి విడుదలైతే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

హరీష్ శంకర్ పవన్ కు వీరాభిమాని కావడంతో పవన్ ను అద్భుతంగా చూపిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నంబర్ సెంటిమెంట్ వల్ల పవన్, మహేష్ లకు ఈ సినిమాలతో కెరీర్ బిగ్గెస్ట్ సక్సెస్ దక్కుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మహేష్ బాబు, పవన్ వేగంగా సినిమాలలో నటిస్తూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారనే సంగతి తెలిసిందే.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus