Jr NTR: సినిమాల విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల విషయంలో ఇతర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. వరుస సినిమాలలో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. తారక్ కొరటాల శివ కాంబో మూవీ దేవర వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెల 5వ తేదీన థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. ఈ ఏడాదే తారక్ వార్2 షూటింగ్ లో పాల్గొననున్నారని తెలుస్తోంది. వార్2 సినిమా కోసం తారక్ మూడు నెలల డేట్స్ కేటాయించారని భోగట్టా.

వఛ్చే ఏడాది మార్చి నుంచి తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ మొదలుకానుంది. ఈ సినిమా బౌండ్ స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధమైందని సమాచారం. ఏడాది గ్యాప్ లో తారక్ నటించిన మూడు సినిమాలు థియేటర్లలో రిలీజయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తారక్ కు ఈ మూడు సినిమాల ద్వారా 250 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందనుందని సమాచారం అందుతోంది. తారక్ కు ప్రతి సినిమాలో బాలీవుడ్ హీరోయిన్లు జోడీగా నటిస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాత సినిమాలతో కూడా వరుస విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమా సినిమాకు క్రేజ్ ను పెంచుకుంటున్న తారక్ ఇతర భాషల్లో సైతం సత్తా చాటే దిశగా అడుగులు వేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాలకు సంబంధించి వస్తున్న కామెంట్ల గురించి స్పందించడం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ పాన్ వరల్డ్ స్థాయిలో సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నందమూరి హీరోలతో కలిసి మల్టీస్టారర్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ కాంబినేషన్ సెట్ అయితే మామూలుగా ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుస విజయాలు తారక్ రేంజ్ ను పెంచగా తారక్ సత్తాకు తగిన సినిమాలు రావాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కు బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus