సినిమా జనాలు సెంటిమెంట్లను బాగా నమ్ముతారు. ఆ మాటకొస్తే ఎవరైనా నమ్ముతారు. కానీ సినిమా వాళ్లు ఎక్కువ నమ్ముతారు. న్యూమరాలజీ, అంకెల శాస్త్రం.. ఇలాంటివాటిని కూడా బాగా ఫాలో అవుతారు. వీటి విషయంలో రామ్‌చరణ్‌కి నమ్మకం ఉందో లేదో తెలియదు కానీ.. ఒకవేళ ఉంటే మాత్రం ఓసారి తనకు ‘మూడు’ గండం ఉందేమో చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే ఆయన ఫిల్మోగ్రఫీలో ‘మూడు’ ఎక్కెం గండం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇదంతా చూసి ఇవేం మూఢనమ్మకాలు అని అనుకోవచ్చు. ఇవి నమ్మకాలు కావు.. కామన్ పాయింట్లు మాత్రమే. కావాలంటే మీరే చూడండి. చరణ్ తన కెరీర్‌లో 15 సినిమాల్లో నటించాడు. వాటిలో మూడుకు ముడిపడి ఉన్న సినిమాల ఫలితాలు వరుసగా తేడా కొడుతున్నాయి. అయితే చరణ్ సినిమాల్లో ఫ్లాప్‌లు అన్నీ మూడెక్కంతోనే లేవు. కొన్ని సినిమాలు ఈ కామన్ పాయింట్ లేకుండా పోయాయి.
అయితే మూడెక్కం కాన్సెప్ట్‌లో వచ్చిన సినిమాలు మాత్రం పక్కాగా తేడా కొట్టేశాయి. కావాలంటే ఫిల్మోగ్రఫీలో మీరే చూడండి ప్రతి రెండు అడుగులు తర్వాత ఓ డిజాస్టర్ / ఫ్లాప్ ఇబ్బంది పెడుతూ వచ్చింది. ‘చిరుత’, ‘మగధీర’తో విజయాలు అందుకున్న తర్వాత ‘ఆరెంజ్’ వచ్చి ఝలక్ ఇచ్చింది. ‘రచ్చ’, ‘నాయక్’తో తిరి ట్రాక్ ఎక్కాడు అనుకుంటే ‘జంజీర్ / తుఫాన్’ వచ్చి డిజాస్టర్ రుచి చూపించింది. ఇది ఆరో సినిమా. ఆ తర్వాత ‘ఎవడు’తో మళ్లీ మంచి విజయం అందుకున్నాడు.
ఆ వెంటనే ‘గోవిందుడు అందరివాడేలే’, ‘ బ్రూస్‌లీ’ వచ్చి భారాన్ని మిగిల్చాయి. వీటిలో 9వ సినిమా. ఆ సినిమా నుండి కోలుకొని ‘ధృవ’, ‘రంగస్థలం’ అంటూ రెండు బ్లాక్‌బస్టర్‌లు కొట్టాడు. ఆ వెంటనే ‘వినయ విధేయ రామా’గా వచ్చి ప్రేక్షకులు, అభిమానులతో అయ్యో రామా అనిపించాడు. ఇది 12వ సినిమా అని మీకు తెలిసే ఉంటుంది. ఆ తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్’ అంటూ ప్రపంచ స్థాయి సినిమా చేశాడు. ఏ ఎఫెక్టో ఏమో ఆ తర్వాత చేసిన ‘ఆచార్య’, ‘గేమ్ ఛేంజర్’ ఇబ్బంది పెట్టాయి. ఇందులో ‘గేమ్ ఛేంజర్’ నెంబరు 15. ఇలా చరణ్‌ను మూడో ఎక్కం ఇబ్బంది పెడుతోంది.