నాలుగులో మూడు అదరగొడుతున్నాయ్!

  • December 27, 2021 / 05:11 PM IST

మాయదారి కరోనా పుణ్యమా అని… గత రెండేళ్లు ఓటీటీలు అదరగొడుతున్నాయి. అప్పటివరకు సినిమా వాళ్లకు ఫస్ట్‌ రిలీజ్‌కి ఆప్షన్‌గానే కనిపించని ఓటీటీ… ఒక్కసారిగా ప్రియారిటీ అయిపోయింది. ప్రేక్షకులకు అయితే ఏకంగా ఇదే లోకమైపోయింది. అయితే ఈ ఏడాది వీటి హడావుడి తగ్గింది. థియేటర్లలో సినిమాలు వస్తున్న నేపథ్యంలో సెకండ్‌ రిలీజ్‌లే ఎక్కువయ్యాయి. అయితే ఇయర్‌ ఎండింగ్‌ మాత్రం ఓటీటీలకు అదిరిపోయింది అంటున్నారు. ఈ వారం ఓటీటీల్లో విడుదలైన నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు మంచి టాక్‌తో దూసుకుపోతుండటమే దీనికి కారణం.

ఇందులో మూడు సినిమాలకు తెలుగు వెర్షన్‌ కూడా ఉంది. కాబట్టి మనకూ ఆసక్తే. అక్షయ్‌ కుమార్‌, ధనుష్‌ , సారా అలీ ఖాన్‌ నటించి ‘అతరంగీ రే’ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో విడుదలైంది. తొలి రోజు నుండి ఈ సినిమాకు స్ట్రీమింగ్స్‌ బాగున్నాయి అంటున్నారు. వ్యూయింగ్‌ టైమ్‌లో రికార్డు అని కూడా టాక్‌. ధనుష్‌ ఈ సినిమాతో మరోసారి బాలీవుడ్‌లో అదరగొట్టాడు. అన్నట్లు ఈ సినిమాను తమిళంలో కూడా రిలీజ్‌ చేశారు.

నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ‘మిన్నల్‌ మురళీ’ అనే సినిమా వచ్చింది. టొవినో థామస్‌ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, హిందీలో కూడా విడుదల చేశారు. టొవనో మ్యాజిక్‌ మరోసారి వర్కౌట్‌ అయ్యింది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌ కూడా బిజీ బిజీగానే ఉంది. ఇక మూడో సినిమా ‘మానాడు’. సోనీ లివ్‌లో ఈ సినిమాను స్ట్రీమ్‌ చేస్తున్నారు. శింబు, ఎస్‌.జె.సూర్య ప్రధాన పాత్రల్లో ఈ సినిమా రూపొందింది. మన దగ్గర థియేటర్లలో విడుదలైతే బాగుండు అని అందరూ అనుకుంటున్నారు.

థియేటర్లలో రాకుండా నిరాశపరిచిన ఈ సినిమా నేరుగా ఓటీటీకి వచ్చి వావ్‌ అనిపించింది. తమిళంలో రూపొందిన ఈ సినిమాను ఇప్పుడు తెలుగు, హిందీ, కన్నడలో విడుదల చేశారు. మూడు చోట్లా ఈ సినిమాకు మంచి ఆదరణే దక్కుతోందట. ఇది కాకుండా నేరుగా ఓటీటీకి ఇచ్చిన తెలుగు సినిమా ‘WWW’కి నిరాశే ఎదురైంది. ఆసక్తికరమైన అంశాన్నే ఎంచుకున్నా… సరైన ఎగ్జిక్యూషన్‌ కుదరక సినిమా నిరాశపరిచింది అని చెబుతున్నారు. అలా ఈ ఇయర్‌ ఎండింగ్‌కి ఓటీటీలో సందే సందడి.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus