Kalki 2898AD: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో గేమ్‌ స్టార్ట్‌ చేస్తే… ‘కల్కి’తో మసాలా యాడ్‌ చేస్తున్నారు!

సినిమా ఓటీటీ రిలీజ్‌ అంటే ఒక్క ఓటీటీలోనే జరగాలా ఏంటి? ఒకటికి మించి ఉండొచ్చు కదా? అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఒకవేళ మీకు అనిపించి ఉంటే ‘ఒకటేముంది ఎన్నైనా ఉండొచ్చు అని ఆ మధ్య ఓ సినిమా చూపించింది. ఇప్పుడు మరో పెద్ద సినిమా ఇదే తరహా ఆలోచన చేస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆ సినిమా ఏకంగా మూడు ఓటీటీల్లో రిలీజ్‌ అవుతుందట. మీకు గుర్తుండి ఉంటే..

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమా వచ్చినప్పుడు ముందు ఒక ఓటీటీలో, ఆ తర్వాత మరో ఓటీటీలో రిలీజ్‌ చేశారు. అలా రెండింటిలోనూ చూసే అవకాశం కల్పించారు. అయితే రెండు రిలీజ్‌లకు మధ్య గ్యాప్‌ ఉంది. అయితే ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’  (Kalki 2898 AD) సినిమా విషయంలో టీమ్‌ డిఫరెంట్‌గా ఆలోచిస్తోంది. ప్లాన్స్‌ వర్కవుట్‌ అయితే సినిమాను ఏకంగా మూడు ఓటీటీల్లో స్ట్రీమ్‌ చేయాలని, అది కూడా ఒకేసారి అని అంటున్నారు.

‘కల్కి 2898 ఏడీ’ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, విజువల్స్ హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ భారీ ధరకు అమ్ముడుపోయిందని తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌, జీ5కు సినిమా డిజిటల్ హక్కులు ఇచ్చేశారట. నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, ఇంగ్లీష్ అలాగే కొన్ని విదేశీ భాషలలో స్ట్రీమ్‌ చేస్తారట. అమెజాన్, జీ5లో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా ఉంటుందట.

అలా మొత్తంగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమా డిజిటల్ రైట్స్ రూ.375 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును ఈ సినిమా బద్దలు కొట్టింది అంటున్నారు. అంతేకాదు ‘కల్కి’ని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ చేసేటప్పుడు మరికొన్ని అంతర్జాతీయ భాషల్లో డబ్‌ చేస్తారు అని చెబుతున్నారు. ఇక ఈ సినిమాను జూన్ 27న విడుదల చేస్తారు. జూన్‌ 5 నుండి సినిమా ప్రచారం భారీ స్థాయిలో మొదలవుతుందట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus