ఆ ముగ్గురు హీరోలు రిజెక్ట్ చేస్తే.. నాని చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు..!

‘ఈగ’ సినిమా తర్వాత వరుస ప్లాప్స్ తో డీలా పడిపోయిన నాని… ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. అంతేకాదు నాని ని.. నేచురల్ స్టార్ ను చేసింది కూడా ఈ చిత్రమే..! మారుతీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘జిఏ2 పిక్చర్స్’ మరియు ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలు కలిసి నిర్మించాయి. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. 2015 సెప్టెంబర్ 4న ఈ చిత్రం విడుదలయ్యింది. ఈరోజుతో 5 ఏళ్ళు పూర్తిచేసుకోబోతుంది ఈ చిత్రం. మైండ్ డైవర్షన్ తో బాధపడే హీరో.. తను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం చేసే ప్రయత్నమే ఈ చిత్రం మెయిన్ థీమ్ అని చెప్పొచ్చు.

దర్శకుడు ఈ చిత్రాన్ని ఆధ్యంతం ఎంటర్టైన్మెంట్ తో నింపేసి.. చివర్లో కాస్త కంట తడి పెట్టించినా..మళ్ళీ నవ్వుతూనే ప్రేక్షకుడు థియేటర్ నుండీ బయటకు వచ్చేలా తీర్చిదిద్దాడు. అయితే ఇలా ‘మైండ్ డైవర్షన్’ తో బాధపడే పాత్రను చెయ్యడానికి ముగ్గురు హీరోలు నిరాకరించారట. క్లియర్ గా చెప్పాలి అంటే.. దర్శకుడు మారుతీ.. ‘భలే భలే మగాడివోయ్’ కథని నాని కంటే ముందు ముగ్గురు హీరోలకు చెప్పాడట.

ఆ హీరోలు మరెవరో కాదు.. నాగ చైతన్య, సునీల్, అల్లరి నరేష్. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రాన్ని వారు రిజెక్ట్ చేశారు. దాంతో ఈ చిత్రం చేసే అవకాశం నానికి దక్కింది. ఈ చిత్రం చేసిన దగ్గరనుండీ నానికి పెద్దగా ఫ్లాప్స్ పడలేదనే చెప్పాలి. పైగా అతని మార్కెట్ ను కూడా ఈ చిత్రం రెండింతలు పెంచింది అని చెప్పడంలో సందేహం లేదు.

Most Recommended Video

తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus