Major Movie: అడివి శేష్ సినిమాకి ఇంత మంది స్టార్ల సపోర్టా.. పెద్ద మాస్ ఇది..!

ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న మేజర్ చిత్రం టీజర్ రేపు అనగా ఏప్రిల్ 12 న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల కాబోతుంది. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతోన్న ఈ చిత్రం హిందీ టీజర్ ను సల్మాన్ ఖాన్, తెలుగు టీజర్ ను మహేష్ బాబు, మలయాళం టీజర్ ను పృథ్వి రాజ్ సుకుమారన్ వంటి స్టార్ హీరోలు విడుదల చేయబోతున్నారు. 26/11 ముంబై అటాక్స్ లో ఆఫీసర్ సందీప్ ఉన్ని కృష్ణన్ చేసిన త్యాగం అంత ఈజీగా మర్చిపోయేది కాదు..

ఆ సంఘటనతో పాటు మేజర్ జీవితం గురించి మనకి తెలియని విషయాలను కూడా ఈ చిత్రం ద్వారా తెలియజేయబోతున్నారు. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్, శోబితా ధూళిపాల వంటి క్రేజీ భామలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. గూఢచారి ఫేం శశి కిరణ్ తిక్కా ఈ చిత్రానికి దర్శకుడు. జి.ఎం.బి.ఎంటర్టైన్మెంట్ మరియు ఎ ప్లస్ మూవీస్ బ్యానర్ల తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus