This Weekend Movies: ఈవారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..

ప్రస్తుతం సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నప్పుడు ఎంతటి హంగామా నెలకొంటుందో.. ఓటీటీలో స్ట్రీమింగ్ అప్పుడు కూడా అంతే సందడి నెలకొంటుంది.. ఇంతకుముందు చూసిన వాళ్లు, చూడడం మిస్ అయిన వాళ్లు.. ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి కొత్త చిత్రాలను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా లేటెస్ట్ మూవీస్, వెబ్ సిరీస్‌లను ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చేందుకు పోటీ పడుతున్నాయి.. ఫిబ్రవరి రెండో వారంలో ఓటీటీ మరియు థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు, సిరీస్‌లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

వేద..

‘కాంతార’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం.. ‘వేద’.. ‘కరునాడ చక్రవర్తి’ డా. శివ రాజ్ కుమార్, గన్వి లక్షణ్, శ్వేత చెన్నగప్ప, ఉమాశ్రీ, అదితి సాగర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అర్జున్ జన్య సంగీతమందించిన ఈ చిత్రాన్ని గీత శివ రాజ్ కుమార్ నిర్మించగా.. హర్ డైరెక్ట్ చేశారు. కన్నడతో పాటు తెలుగులోనూ ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతోంది.

అమిగోస్..

కెరీర్ ప్రారంభం నుండి డిఫరెంట్ కాన్సెప్ట్స్, ఛాలెంజింగ్ క్యారెక్టర్లతో అలరిస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన వైవిధ్యభరితమైన సినిమా.. ‘అమిగోస్’.. రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆషిక రంనాథ్ కథాానాయిక. ఫిబ్రవరి 10న విడుదల కానుంది..

పాప్ కాRన్..

అవికా గోర్, సాయి రోనక్ జంటగా.. మురళీ గంధం దర్శకత్వంలో భోగేంద్ర గుప్త నిర్మించిన ఫిలిం.. ‘పాప్ కాRన్’.. వెరైటీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది..

దేశం కోసం భగత్ సింగ్..

రవీంద్ర గోపాల, రాఘవ, మనోహర్, జీవా, సుధ తదితరులు నటించిన చిత్రం.. ‘దేశం కోసం భగత్ సింగ్’.. రవీంద్ర గోపాల నటిస్తూ, నిర్మించి దర్శకత్వం వహించారు.. ఫిబ్రవరి 10న విడుదలవుతోంది..

చెడ్డీ గ్యాంగ్ తమాషా..

వెంకట్, గాయత్రి, విజయ్ కార్తిక్, క్రాంతి కిరణ్, తేజ, దేవినేని చైతన్య నటించిన ‘చెడ్డీ గ్యాంగ్ తమాషా’ ని జి. వెంకట్ కళ్యాణ్ డైరెక్ట్ చేయగా.. క్రాంతి కిరణ్ ప్రొడ్యూస్ చేశారు. ఫిబ్రవరి 10 శుక్రవారం ఆడియన్స్ ముందుకు రానుంది..

ఐపీఎల్ : ఇట్స్ ప్యూర్ లవ్..

విశ్వ కార్తికేయ, నితిన్ నషా, అర్చనా గౌతమ్, అవంతిక నటించిన మూవీ.. ‘ఐపీఎల్ : ఇట్స్ ప్యూర్ లవ్’.. టైటిల్‌తోనే ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ఫిలిం ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతోంది..

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు – వెబ్ సిరీస్‌లు..

నెట్‌ఫ్లిక్స్..

తెగింపు – తెలుగు మూవీ – ఫిబ్రవరి 8..

బిల్ రస్సెల్ – హాలీవుడ్ – ఫిబ్రవరి 8..

ది ఎక్స్ఛేంజ్ – అరబిక్ సిరీస్ – ఫిబ్రవరి 8..

యూ – వెబ్ సిరీస్ – 4 పార్ట్ 1 – ఇంగ్లీష్ సిరీస్ – ఫిబ్రవరి 9..

డియర్ డేవిడ్ – ఇండోనేషియన్ మూవీ – ఫిబ్రవరి 9..

మై డాడీ ద బౌంట్ హంటర్ – ఇంగ్లీష్ సిరీస్ – ఫిబ్రవరి 9..

యువర్ ప్లేస్ ఆర్ మైన్ – హాలీవుడ్ – ఫిబ్రవరి 10..

టెన్ డేస్ ఆఫ్ ఎ గుడ్‌మాన్ – టర్కిష్ ఫిలిం – ఫిబ్రవరి 10..

లవ్ ఈజ్ బ్లైండ్ – సీజన్ – 3 – ఇంగ్లీష్ సిరీస్ – ఫిబ్రవరి 10..

లవ్ టూ హేట్ యూ – కొరియన్ సిరీస్ – ఫిబ్రవరి 10..

అమెజాన్ ప్రైమ్ వీడియో..

ఫర్జీ – తెలుగు వెబ్ సిరీస్ – ఫిబ్రవరి 10..

హంట్ – తెలుగు సినిమా – ఫిబ్రవరి 10..

ఆహా..

కళ్యాణం కమనీయం – ఫిబ్రవరి 10..

డిస్నీ+హాట్‌స్టార్..

నాట్ డెడ్ ఎట్ – వెబ్ సిరీస్ – ఫిబ్రవరి 9..

రాజయోగం – తెలుగు సినిమా – ఫిబ్రవరి 9..

హన్నికాస్ లవ్ షాదీ డ్రామా – రియాలిటీ షో – ఫిబ్రవరి 10..

మార్వెల్ స్టూడియోస్ లెజెండ్స్ – సీజన్ 2 – ఫిబ్రవరి 10..

సోనీలివ్..

నిజం విత్ స్మిత – టాక్ షో – ఫిబ్రవరి 10..

ఎమ్ఎక్స్ ప్లేయర్..

కుమితే 1 వారియర్ హంట్ – ఇంగ్లీష్ సిరీస్ – ఫిబ్రవరి 12..

జీ 5..

వేద – తెలుగు డబ్బింగ్ మూవీ – ఫిబ్రవరి 10..

సలామ్ వెంకీ – హిందీ సినిమా – ఫిబ్రవరి 10..

షీమారో..

గోటి సోడా సీజన్ 3 – గుజరాతీ సిరీస్ – ఫిబ్రవరి 9..

ముబి..

దూయిన్ – హిందీ సినిమా – ఫిబ్రవరి 10..

హాయ్ చోయ్..

గోబిర్ జోలెర్ మచ్ – బెంగాలీ సిరీస్ – ఫిబ్రవరి 10..

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus