‘సినిమాలో కామెడీ ఉందా- లేదు, సినిమాలో అదిరిపోయే ఇంట్రో సీన్ ఉందా- లేదు, సినిమాలో ఐటెం సాంగ్ ఉందా- లేదు, ఇంటర్వెల్ దగ్గర భారీ ఫైట్, డైలాగులు, విలన్ కు వార్ణింగ్ లు ఇవ్వడం వంటివి ఉన్నాయా – లేవు, హీరోయిన్ అందాల ఆరబోత ఉందా- లేదు, ఫారెన్ లొకేషన్లలో పాటలు ఉన్నాయా – లేవు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయా – లేవు…! ఏమి లేవు అంటున్నావ్.. కనీసం సినిమా యావరేజ్ అయినా ఆడిందా? ‘లేదు ఇండస్ట్రీ హిట్ అయ్యింది’ ‘. సరిగ్గా ఇలాంటి సమాధానాలు చెప్పుకోవాలి అంటే మనం ‘శివ’ సినిమా గురించి చెప్పుకోవాలి.
నిజమే ఈ సినిమాలో అవేమి లేవు. మనం ఊహించిన సన్నివేశం ఈ సినిమాలో ఒక్కటి కూడా ఉండదు. అలాగే బాలేదు అనే మాట కూడా ఎక్కడా రానివ్వదు. అంతలా పకడ్బందీగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు మన ఆర్జీవీ. ఓ కొత్త కుర్రాడు వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టడం.. అదీ ఏమాత్రం మాస్ ఇమేజ్ లేని నాగార్జున వంటి హీరోతో.. అంటే మాటలు కాదు. పైగా అప్పుడు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలు దూసుకుపోతున్న రోజులవి. ఆరోజు నాగార్జున కొత్త కుర్రాడికి(ఆర్జీవీ) అవకాశం ఇచ్చి ఉండకపోతే… ఈరోజు ఎంతో మంది దర్శకులు అవుదాం అని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారి భవిష్యత్తు ప్రశ్నర్ధకంగా మారేది.
పైగా ఇప్పటికీ అవే మూలనపడిపోయిన కథలు వస్తుండేవి అనడంలో అతిశయోక్తి కాదేమో. ఈరోజు ‘శివ’ సినిమా రిలీజ్ అయ్యి 32 ఏళ్ళు పూర్తికావస్తోంది. నిజానికి ఈ కథ చాలా మంది హీరోల వద్దకు వెళ్ళింది. అందరు హీరోలు తిప్పికొట్టిన కథ ఇది.హీరోలు, నిర్మాతలు మార్పులు కోరుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వని కథ ఇది. అలాంటి కథలో నాగార్జున నటించడం ఒక సాహసం అయితే.. దాని నిర్మాణ బాధ్యతల్ని కూడా ఆయన నెత్తిమీద వేసుకోవడం మరో సాహసం. ఈ చిత్రం ఫుల్ రన్లో అప్పటి వరకు ఉన్న సినిమాల కల్లెక్షన్లని అధిగమించడమే కాకుండా 22 కేంద్రాల్లో 100 రోజులు, 5 కేంద్రాల్లో 175 రోజులు ఆడి చరిత్ర సృష్టించింది. దీనిని క్లాసిక్ అనే కాకుండా ఓ గేమ్ ఛేంజర్ మూవీ అని కూడా అనాలి..!
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!