‘బిగ్‌బాస్ 8’ (Bigg Boss 8 Telugu) 3వ వారం నామినేషన్ల ప్రక్రియ వరకు వచ్చేసింది. సోమవారం నాడు నామినేషన్స్ ప్రక్రియ నిర్వహించాడు బిగ్ బాస్. ఈసారి ‘ట్రాష్ బిన్’ (చెత్త బుట్ట) థీమ్ ను ప్రవేశ పెట్టాడు. అంటే ఒక్కో కంటెస్టెంట్ ఎవరైతే హౌస్లో ఉండేందుకు అనర్హులు అని భావిస్తారో.. ఆ కంటెస్టెంట్లని వాళ్ళు నామినేట్ చేసుకోవచ్చనమాట.అయితే చీఫ్..లుగా వ్యవహరిస్తున్న అభయ్ (Abhay Naveen) , నిఖిల్‌ను (Nikhil) ఎవరూ నామినేట్ చేయకూడదు. అది బిగ్ బాస్ పెట్టిన కండిషన్.
ఇక నామినేట్ చేసే కంటెస్టెంట్లపై చెత్త పోసి నామినేట్ చేయాలనేది ఈ ప్రక్రియలో ఓ భాగం. ఈ క్రమంలో ముందుగా సీత (Kirrak Seetha) ముందుకొచ్చింది. ఆమె ఎంట్రీ ఇవ్వడమే యష్మీని (Yashmi Gowda) నామినేట్ చేస్తున్నట్టు తెలిపింది. ‘యష్మీ కసిగా గేమ్ ఆడుతుంది. కానీ గెలిచే క్రమంలో ఆమె ధోరణి నాకు నచ్చలేదు, ముఖ్యంగా చీఫ్‌గా ఉన్నప్పుడు ఆమె పక్షపాతంగా వ్యవహరించింది’ అనే రీజన్ చెప్పి యష్మీని నామినేట్ చేసింది సీత. తర్వాత పృథ్వీని (Prithviraj) కూడా నామినేట్ చేసి చెత్త పోసింది.
ఆ తర్వాత విష్ణుప్రియ (Vishnu Priya) ప్రేరణని (Prerana) నామినేట్ చేసింది. ఈ క్రమంలో ఆమె చెప్పిన రీజన్ కి ప్రేరణ కాసేపు విష్ణుప్రియతో ఆర్గ్యుమెంట్ కి దిగింది.ఆ తర్వాత యష్మీని నామినేట్ చేయడం జరిగింది. అటు తర్వాత మణికంఠ (Naga Manikanta) యష్మీని నామినేట్ చేశాడు.అతను చెప్పిన రీజన్ యష్మీ అంగీకరించకుండా గొడవకి దిగింది.’నువ్వు ఫేక్’ అంటూ మణికంఠ పై ఘాటు కామెంట్స్ చేసింది. తర్వాత మణికంఠ పృథ్వీని నామినేట్ చేశాడు.అలాగే ప్రేరణ వచ్చి సీతను నామినేట్ చేసింది.ఆ తర్వాత విష్ణుప్రియని నామినేట్ చేసింది.
చెత్త పోస్తున్న టైంలో ‘బ్రెయిన్ లెస్ పీపుల్, యూజ్ లెస్ పీపుల్ అంటూ’ మాటలు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇదే క్రమంలో ఆదిత్య విష్ణుప్రియ, మణికంఠ..లను నామినేట్ చేశాడు. అలాగే నైనిక.. సోనియా (Nainika ), ప్రేరణలను నామినేట్ చేసింది. అటు తర్వాత యష్మీ.. మణికంఠని, నైనికని నామినేట్ చేసింది. అటు తర్వాత నబీల్ (Nabeel Afridi) .. యష్మీ, ప్రేరణలను నామినేట్ చేయగా పృథ్వీ.. సీత, నైనికలను నామినేట్ చేయడం జరిగింది.