రాజ్ తరుణ్ (Raj Tarun) నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వచ్చాయి. 2 నెలల గ్యాప్ లో ఏకంగా 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు రాజ్ తరుణ్. అవే ‘పురుషోత్తముడు’ ‘తిరగబడరసామి’ (Tiragabadara Saami) ‘భలే ఉన్నాడే’ (Bhale Unnade) . ఇందులో ‘తిరగబడరసామి’ పెద్ద డిజాస్టర్ అయ్యింది. మిగిలిన రెండు సినిమాలు పర్వాలేదు. ‘పురుషోత్తముడు’ కి యావరేజ్ రిపోర్ట్స్ వచ్చాయి. రీసెంట్ గా వచ్చిన ‘భలే ఉన్నాడే’ పర్వాలేదు అనిపించే టాక్ ను తెచ్చుకుంది.అయితే ఈ సినిమా టాక్ కరెక్ట్ గా బయటకు వచ్చేసరికే ఫలితం తేడా కొట్టేసింది.
సెప్టెంబర్ 13 న రిలీజ్ అయిన ఈ సినిమా తొలిరోజు బాగానే పెర్ఫార్మ్ చేసింది. కొన్ని ఏరియాల్లో మ్యాట్నీల నుండి గ్రోత్ కనిపించింది. కానీ పోటీగా రిలీజ్ అయిన ‘మత్తు వదలరా 2′(Mathu Vadalara 2) కి ఇంకా మంచి రిపోర్ట్స్ రావడంతో ‘భలే ఉన్నాడే’ ని ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. రెండో రోజు నుండి ఈ సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ దారుణంగా తయారయ్యింది. రాజ్ తరుణ్ కి కచ్చితంగా హిట్ ఇస్తాను అని దర్శకుడు మారుతీ చెప్పడం జరిగింది.
ఈ సినిమాకి కథ అందించడంతో పాటు ఓ నిర్మాతగా కూడా వ్యవహరించారు మారుతీ (Maruthi Dasari). కచ్చితంగా ‘భలే ఉన్నాడే’ తో తనకి హిట్టు దక్కుతుంది అని రాజ్ తరుణ్ కూడా ధీమాగా ఉంటూ వచ్చాడు. అది జరగకపోయేసరికి అతను కూడా షాకయ్యాడు. రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్ పెట్టి సినిమాకి పుష్ ఇచ్చి ఉంటే.. ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో. ఏదేమైనా మారుతీ కూడా రాజ్ తరుణ్ గట్టెక్కించలేకపోయాడు.