Kalaavathi Song: కళావతి పాట కష్టం చెప్పుకొచ్చిన అనంత శ్రీరామ్!

మహేష్ హీరోగా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా నుంచి ఫిబ్రవరి 13వ తేదీన కళావతి సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. సాంగ్ లీక్ కావడంతో యూనిట్ సభ్యులు సాంగ్ ను రిలీజ్ చేయాల్సిన సమయం కంటే ముందుగానే విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు థమన్ పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు వారి పాట సినిమాలోని పాటలన్నీ హిట్ అవుతాయని మహేష్ ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

Click Here To Watch

యూట్యూబ్ లో కళావతి సాంగ్ రికార్డులు సృష్టిస్తుండగా పాటలో మహేష్ బాబు చాలా అందంగా కనిపించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ పాట రాసిన అనంత శ్రీరామ్ ఈ పాటకు సంబంధించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. కళావతి పాట పల్లవి కోసం తాను ఏకంగా 42 వెర్షన్లు రాశానని అనంత శ్రీరామ్ వెల్లడించారు. 42 వెర్షన్లలో ఒక్కటే వెర్షన్ ను ఫైనల్ చేశారని అనంత శ్రీరామ్ అన్నారు. చరణాల కోసం కూడా తాను 12 వెర్షన్లను రాశానని అనంత శ్రీరామ్ తెలిపారు.

ఈ పాట ఈ స్థాయిలో సక్సెస్ సాధించడం వెనుక తన కష్టం ఏ స్థాయిలో ఉందో అనంత శ్రీరామ్ చెప్పకనే చెప్పేశారు. కళావతి పాటకు ఊహించని స్థాయిలో వ్యూస్ రావడం తనకు సంతోషాన్ని కలిగించిందని ఆయన అన్నారు. ఎంత కష్టపడినా పాట నచ్చాలని లేదని అయితే ఈ పాటకు తగ్గ ఫలితం దక్కిందని అనంత శ్రీరామ్ వెల్లడించారు. ఈ పాటలో మహేష్ ను చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులు అయ్యారని ఆయన పేర్కొన్నారు.

మన పని మనం చేస్తామని అందరి కంటే ముందు తమకు ట్యూన్ వస్తుందని ఆ సాంగ్ ను లీక్ చేసి తృప్తి పడితే అసలైన పనిని కోల్పోవాల్సి ఉంటుందని అనంత శ్రీరామ్ అన్నారు. టెక్నాలజీ వల్ల లీకైన వాటిని ఆపడం సులువే అని ఆయన చెప్పుకొచ్చారు. 2022 సంవత్సరానికి కళావతి సాంగ్ మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus