ఈ నెల 22వ తేదీ నుంచి జీ5 యాప్ లో స్ట్రీమింగ్ అవుతున్న హెడ్స్ అండ్ టైల్స్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సినిమా అద్భుతంగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాను ఎందుకు చూడాలనే దానికి 5 ప్రధాన కారణాలను మనం ఇక్కడ చెప్పుకుందాం. కలర్ ఫోటో కోర్ టీమ్ హెడ్స్ అండ్ టైల్స్ మూవీని రూపొందించింది.
కలర్ ఫోటో కోర్ టీమ్ ఆ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఏ విధంగా తెరకెక్కించిందో ఈ సినిమాను కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా అదే విధంగా తెరకెక్కించడం గమనార్హం. సినిమాలో సునీల్, సుహాస్ పాత్రలు పరిమితమే అయినా కనిపించినంత సమయం తమ పాత్రల ద్వారా మెప్పించారు. గర్ల్ ఫార్ములా యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న దివ్య, శ్రీవిద్య ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
కథ, కథనం బాగుండటం కూడా ఈ సినిమాకు ప్లస్ అయింది. సినిమలో యువతులు తమ తెలివితేటలు, శక్తిసామర్థ్యాలతో సమస్యలను పరిష్కరించుకోవడాన్ని బాగా చూపించారు. తక్కువ నిడివి ఉన్న ఈ సినిమా ఓటీటీలో సినిమా చూడాలని అనుకునే వాళ్లకు బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించడం గమనార్హం. చిన్న సినిమాగా విడుదలైన హెడ్స్ అండ్ టైల్స్ పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు.