దాదాపు మూడు నెలల అనంతరం మళ్ళీ సినిమాల సందడి మొదలు కాబోతోంది. సెకండ్ వేవ్ ను దాటేసిన అనంతరం కొంతమంది నిర్మాతలు చాలా నమ్మకంతో థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమయ్యారు. అయితే జనాలు పెద్ద సినిమాలు వస్తేనే ఆలోచిస్తున్న తరుణంలో చిన్న సినిమాలకు ఎంతవరకు ఎట్రాక్ట్ అవుతారనేది అసలు సందేహం. అసలు థియేటర్స్ వరకు రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారో లేదో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇక సినిమాలు చూసి చాలా రోజులయ్యింది కాబట్టి తప్పకుండా వస్తారని నిర్మాతలు ఆశతో ఉన్నారు. ఇక ఈ శుక్రవారం ఒకేసారి 5 సినిమాలు విడుదల అవుతున్నాయి. అయితే అందులో సత్య దేవ్ యొక్క తిమ్మరుసు పై కాస్త అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ట్రైలర్ కు అయితే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.ఇక జాంబీ రెడ్డితో హిట్ అందుకున్న తేజ సజ్జా ఈ సారి ఇష్క్ అనే థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాపై కూడా ఓ వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఇక నరసింహపురం, త్రయం, పరిగెత్తు పరిగెత్తు.. అనే మరో మూడు సినిమాలు పెద్దగా బజ్ లేకుండానే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ 5 సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతాయన్న నమ్మకం అయితే లేదు. అసలు ప్రేక్షకుల ఈ టైమ్ లో ఎంతవరకు ఆసక్తి చూపుతారనేది పెద్ద సస్పెన్స్. చూడాలి మరి ఏం జరుగుతుందో..
Most Recommended Video
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!