టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాల హవా కొనసాగుతుండగా స్టార్ హీరోలు మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో కేవలం 50 రోజుల వ్యవధిలో ఐదు మల్టీస్టారర్స్ రిలీజ్ కానున్నాయి. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న సినిమాలను పరిశీలిస్తే జనవరి నెల 7వ తేదీన మొదట ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుంది. 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అదే నెలలో జనవరి నెల 12వ తేదీన పవన్ రానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశాలు కూడా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. జనవరి నెల 15వ తేదీన నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమా రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ కచ్చితంగా సంక్రాంతికే రిలీజవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలతో పాటు ఫిబ్రవరి నెల 4వ తేదీన చిరంజీవి, చరణ్ కలిసి నటించిన ఆచార్య మూవీ రిలీజ్ కానుంది. అదే నెలలో ఫిబ్రవరి 25వ తేదీన ఎఫ్3 మూవీ రిలీజ్ కానుంది. కొన్ని రోజుల గ్యాప్ లోనే ఏకంగా 5 మల్టీస్టారర్ సినిమాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రేక్షకులకు ఊహించని స్థాయిలో ఎంటర్టైన్మెంట్ దొరకనుంది. ఈ 5 మల్టీస్టారర్స్ పై భారీగా అంచనాలు నెలకొనగా ఏ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?