సర్దార్ గబ్బర్ సింగ్ నిరాశపరిచినప్పటికీ కాటమరాయుడు సినిమాఫై భారీ అంచనాలు ఉన్నాయి. కారణం పవన్ కళ్యాణ్ క్రేజ్ అని సింపుల్ గా తీసి పారేయలేము. ఈ చిత్రంలో ఆసక్తి కలిగించే అనేక అంశాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైన ఐదు అంశాల గురించి ఫోకస్..
పవన్ కళ్యాణ్ పాత్ర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఇరవై ఏళ్ల సినీ కెరీర్ లో ఎప్పుడూ ఫ్యాక్షన్ లీడర్ పాత్ర పోషించలేదు. కాటమరాయుడులో ఆ క్యారక్టర్ లో కనిపించబోతున్నారు. పంచెకట్టుతో కనికట్టుచేయనున్నారు. అంతేకాదు తమ్ముడిగా తెలుగు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న పవన్ కాటమరాయుడులో నలుగురి తమ్ముళ్లకు అన్నగా నటించారు. ఈ ఫీలింగ్ కొత్తగా ఉందని ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ చెప్పారు. అదే అనుభూతి సినిమా చూసినప్పుడు ప్రేక్షకులకు కలగనుంది.
జోడీగా శృతి పదేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీతో పూర్వ వైభవం సొంతం చేసుకున్నారు. అందులో పవన్ కి శృతి హాసన్ పర్ ఫెక్ట్ జోడీగా సెట్ అయింది. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది. ఆ జోడీ మళ్లీ కాటమరాయుడు లో మ్యాజిక్ చేయనుంది.
అజిత్ కథలో పవన్ రియల్ లైఫ్ లో తమిళ హీరో అజిత్, పవన్ ఒకే విధంగా ఉంటారు. ఇద్దరికీ ఎక్కువమంది అభిమానులు ఉన్నారు. అందుకే అజిత్ చేసిన కథ పవన్ కి బాగా సూట్ అవుతుంది. అందులో ఎటువంటి డవుట్ లేదు. కాటంరాయుడు సినిమాని చూసిన తరవాత మీరు కూడా ఇదే మాట అంటారు.
అలీ కామెడీ పవన్, అలీ బయట ఎంత జాలీగా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటారో, అంతే విధంగా సినిమాల్లోనూ జోకులు పిలుస్తుంటారు. అందుకే ఆలీ లేకుండా పవన్ సినిమాలు పూర్తి కావు. కాటమరాయుడు లోను అలీ పెళ్లి సంబంధాలు తీసుకొచ్చే వ్యక్తిగా నవ్వులు పంచనున్నాడు.
సంగీతం గతంలో పవన్ కళ్యాణ్ సినిమా గోపాల గోపాల కు అనూప్ రూబెన్స్ సంగీతమందించారు. అందులో పాటలన్నీ హిట్ అయ్యాయి. ఇప్పుడు పవన్ కి మరో మారు పాటలను అందించారు అనూప్. పవన్ అభిమానులను దృష్టిలో ఉంచుకొని చేసిన సాంగ్స్ ఉర్రూతలూగిస్తున్నాయి. తెరపైన ఇవి ఇంకా ఆకట్టుకుంటాయనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.