బిగ్ బాస్ హౌస్ లో అనీమాస్టర్ జెర్నీ ముగిసింది. 11 వారాల పాటు తనదైన స్టైల్లో ఎంటర్ టైన్ చేసిన మాస్టర్ గేమ్ ఎట్టకేలకి ఎండ్ అయ్యింది. టాస్క్ లలో గేమ్ లో బాగా ఆడినా కూడా అనీమాస్టర్ గేమ్ ఎక్కడో దెబ్బకొట్టింది. ముఖ్యంగా మనం 5 కారణాలు చూసినట్లయితే,
నెంబర్ 1
అనీమాస్టర్ శ్వేత ఉన్నంతకాలం చాలా చక్కగా గేమ్ ఆడింది. తన గేమ్ ఎక్కడా కూడా దెబ్బకొట్టకుండా చూస్కుంది. కానీ, నామినేషన్స్ అప్పుడు మాత్రం వేరే కంటెస్టెంట్స్ ని ఇమిటేషన్ చేస్తూ ఇరిటేట్ అయ్యేది. అక్కడ ఫ్రస్టేషన్ లో , కోపంలో చాలామాటలు అనేది మాస్టర్. ఉమాదేవిని ఇమిటేషన్ చేయడం, విశ్వని అక్కా తొక్కా అంటూ మాట్లాడద్దు అనడం, కాజల్ పై విరుచుకుపడటం ఇవన్నీ మాస్టర్ గేమ్ ని దెబ్బతీశాయి.
నెంబర్ 2
ఫస్ట్ నుంచీ కాజల్ అండే అస్సలు అనీమాస్టర్ కి గిట్టేది కాదు. ప్రతిదీ స్ట్రాటజీలు అప్లై చేస్తుందని, అన్నీ విషయాల్లో కూడా బిగ్ బాస్ ని గేమ్ లాగానే చూస్తుందని అభిప్రాయపడేది. ఆ తర్వాత కొన్ని విషయాల్లో కాజల్ ని చాలా పర్సనల్ గా తీసేసుకుంది మాస్టర్. ఇక్కడ్నుంచే శ్రీరామ్ ఇంకా రవిల మాటలకి ఇన్ఫులెన్స్ అవుతూ వచ్చింది. ఆ గ్రూప్ లో జాయిన్ అయిపోయింది. తనకి తెలియకుండానే గేమ్ ని మార్చేసుకుంది.
నెంబర్ 3
అనీమాస్టర్ కి ఫస్ట్ నుంచీ కూడా ఓటింగ్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ. విశ్వ , అనీమాస్టర్ , కాజల్ , హమీదా, లహరి ఇలా వీరందరూ కూడా ఓటింగ్ లో లీస్ట్ లో ఉండేవారు. తర్వాత కాజల్ తన గేమ్ ని ఇంప్రూవ్ చేస్కుంటూ మాస్టర్ ని ఓవర్ టేక్ చేసి వెళ్లింది. అనీమాస్టర్ మాత్రం తన గేమ్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేక ఓటింగ్ లో వెనకబడింది. అనూహ్యంగా సన్నీ, కాజల్ , షణ్ముక్ , జెస్సీలు ఓటింగ్ పర్సెంటేజ్ ని పెంచుకుంటూ వచ్చారు. కానీ అనీమాస్టర్ పెంచుకోలోకపోయింది. అంతేకాదు, సోషల్ మీడియాలో పెద్దగా ఫాలోయింగ్ లేకపోవడం కూడా అనీమాస్టర్ ఎలిమినేషన్ కి కారణంగా చెప్పచ్చు.
నెంబర్ 4
ఫస్ట్ నుంచీ సన్నీ, మానస్ లతో ఉన్న మాస్టర్ ఎప్పుడైతే విడిపోయిందో అప్పడ్నుంచీ తన గేమ్ మిస్ అయిపోయింది. ముఖ్యంగా కెప్టెన్సీ టాస్క్ అప్పుడు పిన్ ని చేజిక్కించుకున్న మాస్టర్ సన్నీని కెప్టెన్ ని చేసింది. కానీ ఆ తర్వాత సన్నీతో కలిసి ఉండలేకపోయింది. బొమ్మల టాస్క్ తర్వాత నుంచీ పెద్దగా గేమ్ లో పార్టిసిపేట్ చేయలేకపోయింది. అంతేకాదు, నామినేషన్స్ అప్పుడు కాజల్ తో వచ్చిన ఫైట్ అనేది అనీమాస్టర్ గేమ్ ని పూర్తిగా దెబ్బతీసింది. కాజల్ వరెస్ట్ పెర్ఫామర్ అయినపుడు, ఆ తర్వాత తనని నామినేట్ చేసేటపుడు అనీమాస్టర్ ఉగ్రరూపం చూపించింది. ఇమిటేషన్ చేస్తూనే కాజల్ పై నాగిన్ డ్యాన్స్ చేసింది. ఈ నాగిన్ డ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ అనీమాస్టర్ ఎలిమినేట్ అవ్వాలని బిగ్ బాస్ లవర్స్ ట్రోల్స్ కూడా చేశారు. నాగిన్ డ్యాన్స్ అనేది హౌస్ మేట్స్ తో పాటు, ఆడియన్స్ కి కూడా నచ్చలేదు. దీంతో ఓటింగ్ లో బాగా వెనకబడింది మాస్టర్. గేమ్ పరంగా టాస్క్ ల పరంగా కూడా తను ప్రభావం చూపించలేకపోయింది.
నెంబర్ 5
జెస్సీ ఫోన్ కాల్ మాట్లాడినప్పటి నుంచీ పూర్తిగా వన్ సైడ్ అయిపోయింది అనీమాస్టర్. తన గేమ్ చాలా బాగుందని, జెస్సీ కి థ్యాంక్స్ చెప్పుకుంటూ డ్యాన్స్ కూడా వేసింది. అంతేకాదు, శ్రీరామ్ అండ్ రవి మాటలకి బాగా అలవాటు అయిపోయింది. వాళ్ల మద్యలో జరిగే డిస్కషన్స్ లోనే ఇన్వాల్ అవుతూ మిగతా హౌస్ మేట్స్ కి దూరం అయ్యింది. ఫిమేల్ కంటెస్టెంట్స్ తక్కువగా ఉన్నారని తెలిసి కూడా వారిని డామినేట్ చేస్తూ తన గేమ్ లో ఇంప్రూమెంట్ అనేది చూపించలేకపోయింది. ఎలిమినేట్ అయిపోయింది.