బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ జెర్నీ ముగిసింది. 14 వారాల పాటు తెలుగురాని ఒక అమ్మాయి తెలుగు రియాలిటీషో లో ఉండటం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. ఈ విషయాన్ని నాగార్జున స్టేజ్ పైన కూడా చెప్పాడు. ఇక్కడి వరకూ వచ్చావు అంటేనే విన్నర్ అయినట్లుగా లెక్క అంటూ మాట్లాడాడు బిగ్ బాస్ హౌస్ట్ నాగార్జున. ఇక తన జెర్నీని చూపించినపుడు బాగా ఎమోషనల్ అయ్యింది మోనాల్. గేమ్ లో తను ఎలా పెర్ఫామ్ చేశానో ఒక్కసారి రీకలక్ట్ చేసుకుంది. నిజానికి మోనాల్ ఎలిమినేషన్ అవ్వడానికి గేమ్ లో చిన్న చిన్న తప్పులే కారణం అయ్యాయి. వాటిలో 5 కారణాలు మనం చూసినట్లయితే.
1. మోనాల్ ఫస్ట్ వచ్చిన దగ్గర్నుంచి బాగా ఎమోషనల్ అయ్యింది. ఏడుపే ఆయుధంగా హౌస్ లో తన జెర్నీ స్టార్ట్ చేసింది. మొదట్లో సూర్యకిరణ్ ఇరిటేట్ అవ్వడం, ఆ తర్వాత అందరితో తన లైఫ్ లో జరిగిన బాధని పంచుకోవడం అనేది మోనాల్ వీక్ నెస్ అయ్యింది. ఇలా రెండు మూడు వారాలు ఎలిమినేషన్ గండం నుంచి బయటపడింది. లేదంటే అప్పుడే ఎలిమినేట్ అయిపోయి ఉండేది.
2. ఎప్పుడైతే అఖిల్ అండ్ అభిజిత్ విషయంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీలాగా ఆడియన్స్ కి బిగ్ బాస్ టీమ్ ప్రజెంట్ చేశారో, అప్పట్నుంచీ మోనాల్ కి సపరేట్ ఆడియన్స్ పుట్టుకొచ్చారు. ముఖ్యంగా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఏడుపు పక్కనబెట్టి గేమ్ పైన ఫోకస్ పెట్టింది మోనాల్. అప్పట్నుంచీ మోనాల్ ని ఆడినయ్స్ అందరూ ఇష్టపడుతూ వచ్చారు. అందుకే ఇన్ని వారాలు పాటుగా హౌస్ లో ఉండగలిగింది.
3. మోనాల్ తన కంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ ని ఓవర్ టేక్ చేయలేకపోయింది. దివి, లాస్య, సుజాత వీళ్లందరూ ఉన్నప్పుడు తనకి స్క్రీన్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా వచ్చింది. దాని వల్ల అన్నివారాలు సేఫ్ జోన్ లోకి వెళ్లింది. అందుకే ఇప్పుడు టాప్ 6 వరకూ చేరుకోగలిగింది.
4. అభిజిత్ విషయంలో 5వ వారం అయిన లొల్లికి బాగా హైలెట్ అయ్యింది మోనాల్. అఖిల్ – అభిజిత్ తో గొడవ పెట్టుకోవడం ఇద్దరి మధ్యలో క్లాషెష్ రావడానికి మోనాల్ కారణం అవ్వడం అనేది ఆ వారం మోనాల్ కి బాగానే కలిసొచ్చింది. మోనాల్ ఉంటే ఇదో టర్న్ అవుతుందని, బిగ్ బాస్ షో ఆసక్తికరంగా ఉంటుందని ప్రేక్షకులు భావించారు. ఒకానొకదశలో డేంజర్ జోన్ లో ఉంటూనే లాస్ట్ మినిట్ లో అందుకే సేఫ్ అయ్యిపోయింది మోనాల్.
5. ఇక ఆ తర్వాత అఖిల్ చుట్టూ తిరుగుతూ తన గేమ్ ని తాను బాగా డిస్టర్బ్ చేస్కుంది. అఖిల్ తనని నామినేట్ చేసేసరికి ఒక్కసారిగా గేమ్ లో గేర్ మార్చింది. అభిజిత్ తో స్వాప్ చేసుకున్న వారం అయితే మోనాల్ ఓటింగ్ లో టాప్ ప్లేస్ లోకి కూడా వెళ్లింది. అప్పుడే తన గేమ్ ని ఇంప్రూవ్ చేసుకుంది. టీ స్టాండ్ టాస్క్ లో పోటీగా నిలుచుని అందరికీ షాక్ ఇచ్చింది. అవినాష్ తో మాట్లాడటం, అరియనాకి ఎదురు చెప్పడం, తనకోసం తను ఫైట్ చేయడం అనేది మోనాల్ ని ఇంతవరకూ తీసుకుని వచ్చింది. అంతేకాదు, హారికని భుజాలపై ఎత్తుకుని కెప్టెన్ ని చేయడంతో మోనాల్ ని అందరూ బాగా ఇష్టపడ్డారు. అందుకే టాప్ – 6 వరకూ రాగలిగింది. అఖిల్ నామినేషన్స్ లో లేనపుడు అఖిల్ ఓట్లు కూడా మోనాల్ కి వచ్చాయి. ఇది కూడా తనకి బాగానే కలిసొచ్చింది.
తెలుగు రాని ఒక గుజరాతీ అమ్మాయి తెలుగు రియాలిటీ షోలో ఆల్ మోస్ట్ టాప్ 6 కంటెస్టెంట్ గా వచ్చింది అంటే అది నిజంగా మామూలు విషయం కాదు.