Sandeep Eliminated: కావాలనే సందీప్ ని పంపించేశారా ? తెర వెనుక ఏం జరిగిందంటే.,

బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ 7వారాలు ఓపిగ్గా కాసుకుని కూర్చుని మరీ సందీప్ మాస్టర్ ని ఎలిమినేట్ చేశారు. కావాలనే సందీప్ మాస్టర్ ని పంపించేశారు. గతంలో కూడా రతిక ఇలా ఓవర్ యాక్షన్ చేసిందని ఓట్లు వేయకుండా పంపించేశారు. ఈసీజన్ లోనే ఆడియన్స్ ఇలా చేస్తున్నారు. ఎవరిని ఎలిమినేట్ చేయాలంటే వారినే చేస్తున్నారు. టాస్క్ లు పరంగా బాగా ఆడినా కూడా సందీప్ మాస్టర్ ఎందుకు ఎలిమినేట్ అయ్యారు. అసలు మాస్టర్ ఎలిమినేషన్ కి మనం ఐదు ప్రధానమైన కారణాలని చూసినట్లయితే.,

నెంబర్ – 1

ఆడియన్స్ కోరుకున్నట్లుగానే సందీప్ మాస్టర్ నామినేషన్స్ లోకి వచ్చారు. అలాగే వాళ్లు అనుకున్నట్లుగానే ఎలిమినేట్ చేశారు. నిజానికి ఫౌల్ గేమ్ అనేది మాస్టర్ కొంప ముంచింది. ఆటలో లూప్స్ పట్టుకునో, లేదా అందరికంటే తెలివిగా స్మార్ట్ గా ఆడానని నిరూపించుకోవడానికి చేసిన పనులు బెడిసి కొట్టాయి. ఆడియన్స్ ఇవేమీ చూడరు అనే ధీమాతో గేమ్ ఆడారు. దీంతో ఆ గేమ్ అనేది ఎవ్వరికీ నచ్చలేదు. ముఖ్యంగా అడియన్స్ లో చాలాసార్లు మాస్టర్ నెగిటివ్ అయిపోయారు.

నెంబర్ -2

నామినేషన్స్ అప్పుడు మాస్టర్ బలంగా ఏ పాయింట్ ని చెప్పి నామినేట్ చేయలేదు. ఫస్ట్ వీక్ నుంచీ కూడా కొన్ని సిల్లీ పాయింట్స్ పట్టుకున్నారు. లాస్ట్ వీక్ కూడా అశ్వినిని సిల్లీ రీజనే చెప్పాడు. అలాగే భోలేని అయితే ఈ బూతులు వినలేకపోయాం అంటూ కబుర్లు చెప్పాడు. కానీ, తనే బూతులు మాట్లాడే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దీంతో ఆడియన్స్ ఓట్ వేయలేకపోయారు. ఇది సందీప్ మాస్టర్ అంటే చూశారా అంటూ ట్రోల్స్ చేశారు. కేవలం ఈవారం మాత్రమే కాదు, చాలావారాలు నామినేషన్స్ లో బలమైన పాయింట్స్ అనేవి లేకుండా పోయాయ్. ఢీ అంటే ఢీ అంటే సమఉజ్జీలని మాస్టర్ ఎంచుకోలేకపోయాడు.

నెంబర్ – 3

టైటిల్ కొట్టడానికి, కప్ కొట్టడానికి ఆడే గేమ్ ఇది కాదు. స్ట్రాటజీలతో ఆడాలి. మన వైపు ఆడియన్స్ వచ్చేలా పాయింట్స్ పట్టుకోవాలి. అది అస్సలు మాస్టర్ గేమ్ లో ఎక్కడ కూడా కనిపించలేదు. టార్చ్ లైట్ వేసి వెతికినా దొరకలేదు. ఎందుకు అంటే., బేసిగ్గా మాస్టర్ బిగ్ బాస్ సీజన్స్ చూడలేదు. అందుకే, బేసిక్ మిస్టేక్స్ చేశారు. బిగినర్ మిస్టేక్స్ గా అవి మారి ఎలిమినేషన్ కి దారి తీశాయ్.

నెంబర్ – 4

ఇదే అసలైన పాయింట్.. స్టార్ మా బ్యాచ్ అనే ముద్ర పడిపోయింది. తెలిసి చేశారో, లేదా తెలియక చేశారో కానీ ఫస్ట్ వీక్ ప్రియాంక, సందీప్ కంటెండర్స్ అయినపుడు మిగతా హౌస్ మేట్స్ అందరూ శివాజీని, రతికని ఎలిమినేట్ చేశారు. కెప్టెన్సీ రేస్ నుంచీ తప్పించారు. అప్పట్నుంచీ శివాజీ వీళ్లందరూ గ్రూప్ గేమ్ ఆడేందుకు ప్లాన్ చేస్కుని వచ్చారని నిరూపించే ప్రయత్నం చేశాడు. అది మాస్టర్ కి బాగా బ్యాడ్ అయ్యింది. అంతేకాదు, టాస్క్ లలో పెర్ఫామన్స్ బాగున్నా కూడ కన్నింగ్ తెలివి వల్ల ఆడియన్స్ దృష్టిలో తక్కువ అయ్యారు.

ఈ ఇసుక హౌస్ మేట్స్ శివాజీ టబ్ లో కాదు, సందీప్ ఆటపై పోసినట్లుగా అయ్యింది పరిస్థితి. అప్పట్నుంచీ కలిసి గేమ్ ఆడుతున్నారు అనేది ఆడియన్స్ కి క్లియర్ గా అర్దమైంది. అంతేకాదు, మాస్టర్ చాలాసార్లు ఫ్లిప్ అయ్యారు. అమర్ తో స్మోకింగ్ జోన్ లో చాలాసార్లు అడ్డంగా దొరికిపోయారు. యావర్ ని సైకిక్ అంటూ టీజ్ చేయడం దగ్గర్నుంచీ , ప్రశాంత్ ని అరే అంటూ మాట్లాడటం, మిగతా వాళ్లని కూడా మీరు ఆటలో నాకంటే తక్కువే అనే భావనతో ఉండటం అనేది మాస్టర్ గేమ్ ని దెబ్బకొట్టింది.

నెంబర్ 5

సోషల్ మీడియాలో మాస్టర్ కి పెద్దగా ఫాలోయింగ్ లేదు. పైగా 7వారాలు నామినేషన్స్ లోకి రాలేదు. దీనివల్ల ఓటింగ్ అనేది లేకుండా పోయింది. మిగతా హౌస్ మేట్స్ గేమ్ ఎలా ఉన్నా సరే అందరూ నామినేషన్స్ లోకి వచ్చి సేఫ్ అయినవాళ్లే. మాస్టర్ అసలు నామినేషన్స్ లో లేకపోవడం వల్ల మాస్టర్ తప్పులు ఆయనకి తెలియలేదు. నామినేషన్స్ లో ఉంటే ఎవరైనా సరే గేమ్ లో తప్పులు చెప్పేవారు. అది నెక్ట్స వీక్ సరిదిద్దుకుంటారు. దీనివల్ల మాస్టర్ గేమ్ లో తన పౌల్స్ ని తను తెలుసుకోలేక ఇంటి కాంపౌండ్ వాల్ దాటాల్సి వచ్చింది. అదీ మేటర్.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus