రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్ మెయిన్ లీడ్స్‌గా.. సంజీవ్ రెడ్డి డైరెక్ట్ చేసిన వెబ్‌సిరీస్.. ‘అహ నా పెళ్లంట’.. (కనీ..వినీ.. ఎరుగని గోలంట!).. జీ5, తమాడా మీడియా సంస్థలు కలిసి ప్రొడ్యూస్ చేశాయి.. యూత్, ఫ్యామిలీ, లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ ఫస్ట్ లుక్, టీజర్ అండ్ ట్రైలర్స్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో పాటు సిరీస్ మీద ఆడియన్స్‌లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఫస్ట్ టైమ్ పోస్టర్స్ చూసిన వాళ్లు చాలా మంది ఇది ఫీచర్ ఫిలిం అనుకున్నారు.
తెలిసిన తర్వాత ‘సిరీస్‌నే సినిమా రేంజ్‌లో తీశారా!’ అంటూ ఆశ్చర్యపోయారు. మొత్తం 8 ఎపిసోడ్లుగా రూపొందిన ‘అహ నా పెళ్లంట’.. (కనీ..వినీ.. ఎరుగని గోలంట!) నవంబర్ 17 నుండి పాపులర్ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. చూసిన వాళ్లంతా సిరీస్ సింప్లీ సూపర్బ్ అని చెప్తున్నారు. మౌత్ టాక్‌తో మస్ట్ వాచ్డ్ తెలుగు సిరీస్‌గా దూసుకెళ్తోంది ‘అహ నా పెళ్లంట’.. కథ, కథనాలకు.. క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టరైజేషన్స్‌కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.
కుటుంబ విలువలు, యువత ఆలోచనలు, అభిప్రాయాల వంటి అంశాలతో వచ్చిన ఈ సిరీస్ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉండడంతో త్వరగా ప్రేక్షకులకు రీచ్ అయింది. రీసెంట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ‘అహ నా పెళ్లంట’.. స్ట్రీమింగ్ స్టార్ట్ చేసిన అతి తక్కువ టైంలోనే అక్షరాలా 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ మార్క్ టచ్ చేయడం విశేషం.. పలు వెబ్ సైట్లు కూడా చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చాయి.
‘‘ఈమధ్య కాలంలో కుటంబంతో కలిసి చూసే ఇలాంటి వెెబ్ సిరీస్‌లు రావడం లేదు.. ‘అహ నా పెళ్లంట’ అందరూ చూడాల్సిన సిరీస్’’ అని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చెప్తున్నారు. రాజ్ తరుణ్, శివానిలతో పాటు లీడ్ క్యారెక్టర్ల పర్ఫార్మెన్సెస్, డైలాగ్స్, సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అన్నీ ‘అహ నా పెళ్లంట’ సిరీస్‌లో హైలెట్ అయ్యాయి..
ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!
మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!