Lovely movie: ఆది సినిమా అక్కడ కూడా హిట్ అయ్యిందట..!

తెలుగు రాష్ట్రాల్లో కొన్ని నెలలు పాటయినా థియేటర్లు తెరుచుకున్నాయి. నార్త్ లో మాత్రం అలా జరగలేదు. అక్కడి మాస్ జనాలు థియేటర్లలో సినిమా చూడాలని తెగ ముచ్చట పడుతున్నారు. కానీ కరోనా కరుణించడం లేదు. ఇదిలా ఉండగా.. నార్త్ జనాలు హిందీ సినిమాలను కూడా పక్కన పెట్టి మన తెలుగు సినిమాలనే ఎక్కువగా వీక్షిస్తున్న సందర్భాలను మనం చూస్తూనే వస్తున్నాం. మన తెలుగు సినిమాలను హిందీలో డబ్ చేసి విడుదల చెయ్యగా మిలియన్లకు మిలియన్ల వ్యూస్ నమోదవుతుండటం విశేషం.

ఇదిలా ఉండగా.. తెలుగులో 9 ఏళ్ళ క్రితం వచ్చి హిట్ అయిన సినిమాని ఇప్పుడు డబ్ చేసి యూట్యూబ్లో విడుదల చెయ్యగా దానికి కూడా 50 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయట. వివరాల్లోకి వెళితే..2012 లో బి.జయ దర్శకత్వంలో వచ్చిన ‘లవ్లీ’ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆది సాయి కుమార్, శాన్వీ జంటగా నటించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు.

అనూప్ రూబెన్స్ సంగీతంలో రూపొందిన ఈ చిత్రం పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘ఆర్.ఆర్. మూవీ’ ‘ఆర్జే సినిమా’ బ్యానర్లపై ఆర్.ఆర్. వెంకట్, బి.ఎ. రాజు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇదిలా ఉండగా 9 ఏళ్ళ తరువాత ఈ చిత్రాన్ని హిందీలో డబ్ చేసి యూట్యూబ్లో విడుదల చెయ్యగా.. అతి తక్కువ సమయంలోనే 50 మిలియన్లకు పైగా వ్యూస్ నమోదయ్యాయట. ‘విజయ్ మేరీ హై’ టైటిల్ తో ‘లవ్లీ’ హిందీలో డబ్ అయ్యింది.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus