‘కింగ్’ అక్కినేని నాగార్జున.. ‘ఘోస్ట్’ తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చారు. ముందుగా ప్రసన్న కుమార్ ని డైరెక్టర్ గా పెట్టి ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఎందుకో ప్రసన్నని పక్కన పెట్టి దర్శకుడి ఛాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ కి అప్పగించారు. ‘నా సామి రంగ’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.గతంలో విజయ్ బిన్నీ ‘ఛలో’ ‘నేను లోకల్’ వంటి హిట్ సినిమాలకి కొరియోగ్రాఫర్ గా చేశారు.
ఇక ‘నా సామి రంగ’ (Naa Saami Ranga) గ్లింప్స్ ని నాగార్జున పుట్టిన రోజు అంటే ఆగస్టు 29న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం మలయాళం హిట్టు మూవీ ‘పెరింజు మరియమ్ జోస్’ అనే చిత్రానికి రీమేక్ అని తెలుస్తుంది. ఒరిజినల్ లో అయితే హీరోయిన్ ట్రాక్ ఉండదు. కానీ తెలుగుకి వచ్చేసరికి చాలా మార్పులు చేస్తున్నారు. మెయిన్ గా హీరోయిన్ ట్రాక్ కి కూడా స్పేస్ ఉండేలా జాగ్రత్త పడ్డారని సమాచారం.
అలాగే కొన్నాళ్లుగా నాగార్జున అభిమానులు మిస్ అవుతున్న మాస్ ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. ఇది పక్కన పెట్టేస్తే.. ‘నా సామి రంగ’ షూటింగ్ అప్పుడే 50 శాతం కంప్లీట్ అయిపోయిందట. అవును సంక్రాంతికే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని టీం భావిస్తుంది. నెక్స్ట్ షెడ్యూల్ ను మైసూర్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!