RRR OTT Offer: ఓటీటీ ఆఫర్ పై ఆర్ఆర్ఆర్ మేకర్స్ స్పందన ఇదే!

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ మరోసారి వాయిదా పడటంతో నిర్మాత దానయ్య సైతం టెన్షన్ పడుతున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ బయ్యర్ల నుంచి దానయ్యపై ఒత్తిడి పెరగడంతో పాటు ఫైనాన్షియర్ల నుంచి కూడా దానయ్యకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫైనాన్షియర్ల నుంచి దానయ్య తీసుకున్న 180 కోట్ల రూపాయలకు తాను షూరిటీగా ఉంటానని రాజమౌళి హామీ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రముఖ ఓటీటీ సంస్థలు భారీ ఆఫర్లను ఇస్తున్నాయి.

ఒక ఓటీటీ సంస్థ ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో చేయడానికి 500 కోట్ల రూపాయల ఆఫర్ ను ఇచ్చినట్టు తెలుస్తోంది. 500 కోట్ల రూపాయలు అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మొత్తమే అయినా ఆర్ఆర్ఆర్ మేకర్స్ మాత్రం సున్నితంగా ఈ ఆఫర్ కు నో చెప్పారు. ఆర్ఆర్ఆర్ ను థియేటర్లలో మాత్రమే విడుదల చేస్తామని మేకర్స్ కన్ఫామ్ చేశారని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ నాలుగుసార్లు వాయిదా పడినా ఈ సినిమాపై అంచనాలు ఏ మాత్రం తగ్గలేదు.

తమ ఎదురుచూపులకు తగ్గ ఫలితం ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్యారంటీగా ఎన్టీఆర్, చరణ్ లకు ఇండస్ట్రీ హిట్ రూపంలో దక్కుతుందని ఈ హీరోల అభిమానులు కోరుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ లో రివీల్ కాని ఎన్నో సర్ప్రైజ్ లు ఉన్నాయని తెలుస్తోంది. రాజమౌళి చరణ్, తారక్ లపై ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరించారని సమాచారం. సినిమా ఎండ్ టైటిల్స్ సమయంలో స్పెషల్ సాంగ్ వస్తుందని ఆ సాంగ్ సినిమాకే హైలెట్ అవుతుందని తెలుస్తోంది.

చరణ్ మళ్లీ షూటింగ్ తో బిజీ అవుతుండగా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ షూటింగ్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది. తారక్ 30వ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాల్సి ఉంది. ప్రభాస్, బన్నీలకు ఇప్పటికే పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు దక్కగా తారక్, చరణ్ లకు కూడా ఆర్ఆర్ఆర్ మూవీతో గుర్తింపు దక్కుతుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus