Pushpa2: పుష్ప2 ఇండస్ట్రీ హిట్ కావడం కోసం సుకుమార్ అలా చేస్తున్నారా?

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప2 సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని ఒక సాంగ్ కోసం 100 మంది డ్యాన్సర్లు, 400 మంది జూనియర్ ఆర్టిస్ట్ లు పని చేస్తున్నారు. ఈ సాంగ్ కోసమే భారీ స్థాయిలో ఖర్చైందని సమాచారం అందుతోంది. పుష్ప2 సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సుకుమార్ ఈ సినిమాలోని సీన్ల విషయంలో కానీ, సాంగ్స్ విషయంలో కానీ రాజీ పడటం లేదని తెలుస్తోంది.

పుష్ప2 సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా రిలీజ్ తర్వాత ఈ సినిమా సంచలనాలు సృష్టించడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప2 ఇండస్ట్రీ హిట్ కావడం కోసం సుకుమార్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. బన్నీ, సుకుమార్ ఈ సినిమా కోసం భారీ లెవెల్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమా పారితోషికాల కోసమే 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు అయిందని సమాచారం అందుతోంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ స్థాయిలో బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. బన్నీ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం.

అల్లు అర్జున్ (Pushpa2) ఈ సినిమాను పూర్తి చేసిన వెంటనే కొత్త సినిమాను మొదలుపెట్టనున్నారని సమాచారం అందుతోంది. బన్నీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా బన్నీ పాన్ ఇండియా హీరోగా మరిన్ని రికార్డులను సొంతం చేసుకుంటారేమో చూడాలి. బన్నీకి ఇతర భాషల్లో సైతం క్రేజ్ పెరుగుతోంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus