Vv Vinayak: వి.వి.వినాయక్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆర్.ఆర్.ఆర్ డిస్ట్రిబ్యూటర్లు..!

తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఛత్రపతి’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నాడు. తెలుగులో అతన్ని హీరోగా లాంచ్ చేసిన దర్శకుడు వి.వి.వినాయక్.. అతన్ని హిందీలో కూడా లాంచ్ చేస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ టైంలో స్టార్ట్ అయిన భారీ బడ్జెట్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. అయితే ఇప్పటివరకు ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ.

గ్లింప్స్ వంటిది ఏదీ కూడా రిలీజ్ కాలేదు. అయితే ఈరోజు ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాయి శ్రీనివాస్ తండ్రి, టాలీవుడ్ బడా నిర్మాత అయిన బెల్లంకొండ సురేష్ ఈ విషయం పై స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ” ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ షూటింగ్ దాదాపు పూర్తయింది. డబ్బింగ్, గ్రాఫిక్స్ వర్క్ బాలన్స్ ఉంది. తెలుగుతో పోలిస్తే కొన్ని మార్పులు చేశారు డైరెక్టర్ గారు! ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ చాలా అద్భుతంగా వచ్చాయి.

ఈ మూవీకి సంబంధించి త్వరలోనే పూర్తి అప్డేట్స్ ఇస్తాం. దర్శకుడు వివి వినాయక్ ఈ చిత్రాన్ని 80 రోజుల్లో పూర్తి చేశారు. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఇందులో ఎక్కువగానే పెట్టాం. హీరోయిన్ కాల్ షీట్స్ వల్ల 3 నెలలు గ్యాప్ వచ్చింది. హిందీ సినిమా కాబట్టి అక్కడి హీరోయిన్ ను పెడితే బెటర్ అని డైరెక్టర్ గారు అనడంతో అక్కడమ్మాయిని పెట్టాం. అందుకే డిలే అయ్యింది. ఇది పెన్ ఇండియా మూవీ.. పాన్ ఇండియా కాదు.

ఎందుకంటే ‘పెన్ స్టూడియోస్’ చాలా పెద్ద సంస్థ. ఆర్ఆర్ఆర్, గంగూబాయ్ లాంటి పెద్ద సినిమాలు చేశారు వాళ్ళు.షూటింగ్ పూర్తయ్యాక నిర్మాతలు చాలా సంతోషించారు.వినాయక్ ను డైరెక్టర్ గా పెట్టి మా బ్యానర్లో రూ.500 కోట్ల బడ్జెట్ తో ఓ సినిమా చేద్దాం అన్నారు. వినాయక్ పనితనం వాళ్లకి అంత బాగా నచ్చింది. కచ్చితంగా ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ సూపర్ హిట్ అవుతుంది” అంటూ బెల్లంకొండ సురేష్ చెప్పుకొచ్చారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus