కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి (Suriya) తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ‘గజిని’ సినిమాతో సూర్యకి మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత సూర్య నటించిన సినిమాలు అన్నీ సమాంతరంగా తెలుగులో కూడా డబ్ అవుతూ వచ్చాయి. ‘7th సెన్స్’ (7th Sence) ‘యముడు’ (Yamudu) ‘యముడు 2’ (Yamudu 2) ’24’ (24 Movie) వంటి సినిమాలు తెలుగులో మంచి విజయాలు సాధించాయి. ’24’ వరకు సూర్య సినిమాలు ఈజీగా రూ.100 కోట్ల మార్క్ ను టచ్ చేసేవి. సూర్య ఫామ్లో ఉన్నప్పుడు విజయ్ సినిమాలు నిలబడేవి కాదు.
తెలుగులో కూడా అంతే. కానీ ‘ఎన్జీకే’ నుండి సూర్య థియేట్రికల్ మార్కెట్ డౌన్ అవుతూ వస్తుంది. ‘ఆకాశం నీ హద్దురా’ ‘జై భీమ్’ వంటి సినిమాలు .. సూర్య కరెక్ట్ ఫోకస్ పెడితే సూపర్ హిట్లు కేక్ వాక్ అని అంతా అనుకున్నారు. కానీ తర్వాత వచ్చిన ‘ఈటి'(ఎవ్వరికీ తలవంచడు) ‘కంగువా’ (Kanguva) ‘రెట్రో’ (Retro) వంటి సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. అయితే హిట్స్ అండ్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సూర్యని అభిమానించే వారి సంఖ్య ఉంది.
అందుకే అతని నెక్స్ట్ సినిమాకు రూ.50 కోట్లు పారితోషికంగా అందుకుంటున్నాడట. ప్లాప్స్ ను బట్టి చూస్తే.. సూర్య పారితోషికం ఎక్కువ అనిపించొచ్చు. కానీ తమిళ్ లో శివకార్తికేయన్ వంటి మిడ్ రేంజ్ హీరోలు కూడా రూ.60 కోట్లు, రూ.70 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. సరైన మాస్ హిట్ పడితే సూర్య సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అందుకే నాగ వంశీ(Suryadevara Naga Vamsi) నిర్మాణంలో సూర్య చేస్తున్న స్ట్రైట్ తెలుగు సినిమాకు రూ.50 కోట్లు పారితోషికం ఇస్తున్నారట. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకుడు.