Sumanth: హీరోయిన్ తో సుమంత్ రెండో పెళ్ళి….. ఈసారైనా నమ్మొచ్చా?

సుమంత్ యార్లగడ్డ (Sumanth)  అందరికీ సుపరిచితమే. అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao)  మనవడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇతను ‘ప్రేమకథ’ ‘యువకుడు’ (Yuvakudu) ‘పెళ్ళిసంబంధం’ (Pelli Sambandham) ‘రామ్మా చిలకమ్మా’ (Ramma Chilakamma) ‘స్నేహమంటే ఇదేరా’ (Snehamante Idera) వంటి సినిమాలు చేశాడు. కానీ ఇతనికి మొదటి బ్రేక్ ఇచ్చిన సినిమా ‘సత్యం’ (Satyam) అనే చెప్పాలి. ఆ తర్వాత అతనికి కొంత ఇమేజ్ ఏర్పడింది. ఆ తర్వాత ‘గౌరీ’ (Gowri) అనే సినిమా చేశాడు. అది కూడా బాగానే ఆడింది. ‘మహానంది’ (Mahanandi) ‘గోదావరి'(Godavari)  ‘మధుమాసం’ ‘పౌరుడు’ (Pourudu) ‘గోల్కొండ హైస్కూల్’ (Golconda High School) ‘మళ్ళీ రావా'(Malli Raava) వంటి సినిమాలు కూడా పర్వాలేదు అనిపించేలా ఆడాయి.

Sumanth

ఇక సుమంత్ వ్యక్తిగత జీవితం కూడా అందరికీ తెలిసిన పుస్తకమే. అతను 2004లో ‘తొలిప్రేమ’ (Tholi Prema) హీరోయిన్ కీర్తి రెడ్డిని (Keerthi Reddy) ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2006 లో విడిపోయారు. అప్పటి నుండి సుమంత్ సింగిల్ గానే ఉంటూ వస్తున్నాడు. అయితే కొన్నేళ్ల క్రితం సుమంత్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ ఓ శుభలేఖ బయటకు వచ్చింది. అయితే అది ఓ సినిమా ప్రమోషన్ కి అని చెప్పి తర్వాత అందరికీ షాకిచ్చాడు.

ఇప్పుడు మళ్ళీ సుమంత్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ ప్రచారం మొదలైంది. ఈసారి మాత్రం అంత ఈజీగా నమ్మేలా లేరు ప్రేక్షకులు. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం.. సుమంత్ ఓ హీరోయిన్ ను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అని అంటున్నారు. ఇందుకు కుటుంబ సభ్యులు కూడా ఆమోదం తెలిపారట. త్వరలోనే సుమంత్ రెండో పెళ్లికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఇందులో ఎంతవరకు నిజముందో..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus