Tollywood: స్టార్ హీరోల సమ్మర్ విరామం.. ఎవరెవరు బ్రేక్‌లో ఉన్నారు?

టాలీవుడ్‌లో ప్రస్తుతం పలు భారీ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. SSMB29, రాజా సాబ్ (The Rajasaab), ఫౌజీ, డ్రాగన్, పెద్ది (Peddi) వంటి పాన్-ఇండియా స్థాయి చిత్రాలు తెలుగు సినిమా సత్తాను చాటిచెప్పే సినిమాలే. స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమాలు భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నాయి. అయితే, సమ్మర్ సీజన్‌లో చాలా మంది స్టార్ హీరోలు షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ మినహా మిగిలిన హీరోలు ఈ వేసవిలో విరామంలో ఉన్నట్లు తెలుస్తోంది.

Tollywood

ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం ప్రశాంత్ నీల్  (Prashanth Neel) దర్శకత్వంలో ‘డ్రాగన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ షెడ్యూల్ త్వరలో పూర్తవుతుంది, ఆ తర్వాత ఆయన కూడా బ్రేక్ తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు, పవన్ కళ్యాణ్  (Pawan Kalyan)  రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu), ‘ఓజి’ (OG Movie)షూటింగ్స్ నుంచి విరామంలో ఉన్నాడు. డేట్స్ కుదిరితే సమ్మర్‌లోనే షూటింగ్‌లు పూర్తి చేయడానికి ఈ సినిమాల నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. కానీ, పవన్ షెడ్యూల్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.

సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) రాజమౌళితో (S. S. Rajamouli) ‘SSMB29’ చిత్రీకరణలో ఉన్నాడు. రెండు షెడ్యూల్స్ పూర్తయిన ఈ సినిమా తాజాగా సమ్మర్ బ్రేక్‌లో ఉంది, దీంతో మహేష్ ఖాళీగా ఉండకుండా తన ఫ్యామిలీతో వెకేషన్ మోడ్ లో ఉన్నాడు. రామ్ చరణ్ (Ram Charan) బుచ్చిబాబు (Buchi Babu Sana)  దర్శకత్వంలో ‘పెద్ది’ షూటింగ్‌లో ఉన్నాడు, కానీ సమ్మర్ కారణంగా ఆయన కూడా విరామం తీసుకున్నాడు. ప్రభాస్ (Prabhas)  మోకాలి సర్జరీ తర్వాత గత కొంతకాలంగా రెస్ట్‌లోనే ఉన్నాడు.

ఏళ్ళు గడుస్తున్నా నయన్ డిమాండ్ తగ్గట్లేదుగా..!

అల్లు అర్జున్ (Allu Arjun) అట్లీతో (Atlee Kumar)  కొత్త సినిమా చేయబోతున్నాడు, కానీ ఆ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పూర్తయి సెట్స్‌పైకి వెళ్లే సరికి జూన్ అవుతుంది. దీంతో బన్నీకి కూడా బ్రేక్. టాలీవుడ్ స్టార్ హీరోలంతా సమ్మర్‌లో షూటింగ్స్ నుంచి బ్రేక్‌లో ఉన్నారు. ఈ గ్యాప్‌లో వారు విదేశీ ట్రిప్స్ లేదా వ్యక్తిగత పనులతో బిజీగా ఉండొచ్చని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాలు మళ్లీ సెట్స్‌పైకి వెళ్లనున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus