భరత్ అనే నేను లో ఆకర్షించే అంశాలు!

  • April 18, 2018 / 06:48 PM IST

కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన భరత్ అనే నేను సినిమా ఈ నెల 20 న సినిమా రిలీజ్ కానుంది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. శ్రీమంతుడు కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాలో ఆకర్షించే అంశాలు…

స్టోరీ ఒక ఎన్నారై తన మాతృభూమి బాగుకోసం తన ఉద్యోగాన్ని వదిలి రాజకీయంలోకి అడుగుపెడతాడు. సేవ చేయాలంటే అడుగడుగునా ఆటంకాలు.. వాటన్నిటిని దాటుకొని ప్రజలకు ఎలా సేవ చేశారనేది కథ.
పొలిటికల్ నేపథ్య సినిమా అనగానే ఏదో రాజకీయ నాయకుడిని టార్గెట్ పెట్టుకొని విమర్శలు చేయడం కామన్. అలాంటి విమర్శలుంటే కాంట్రవస్సీ అయ్యి ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. కానీ అటువంటిది ఏమీ లేదని నిర్మాత స్పష్టం చేశారు. సో కథపై మరింత ఆసక్తి కలుగుతోంది.

మహేష్ బాబు గత చిత్రాలు బ్రహ్మోత్సవం, స్పైడర్ ఫెయిల్ అవ్వడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో మహేష్ ఈ సినిమాని చేశారు. రాజకీయం అంటే అసలు తెలియదని చెప్పే మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో అద్భుతంగా నటించినట్లు టీజర్, ట్రైలర్లు స్పష్టం చేస్తున్నాయి. సీఎం గా మహేష్ నటనను ఫుల్ గా చూసి ఎంజాయ్ చేయడానికి అందరూ ఎదురుచూస్తున్నారు.

కైరా అద్వానీ ధోని బయోపిక్ చిత్రం ద్వారా హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ పరిచయమైంది. ఈ చిత్రంతో కొరటాల దృష్టిలో పడ్డ ఈ నటి భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇది రొమాంటిక కథ కాకపోయినప్పటికీ మహేష్, కైరా జోడీ కొత్త అనుభూతిని ఇస్తోంది.

కొరటాల శివ & మహేష్ బాబు కాంబో శ్రీమంతుడు సినిమా రిలీజ్ కాకముందు.. ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్ సాదిస్తుందని ఎవరూ ఊహించలేదు. క్లాస్, మాస్ అని తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంది. కలక్షన్ల వర్షం కురిపించింది. అదే కాంబినేషన్లో మూవీ అనగానే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలకు మించి కొరటాల సినిమాని మలిచారు.

దేవి శ్రీ ప్రసాద్ గతంలో మహేష్, కొరటాల కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు సినిమాకి దేవీ మంచి ఆల్బమ్ ఇచ్చారు. మళ్ళీ అదే కాంబినేషన్లో రూపుదిద్దుకున్న సినిమాకి అంతకంటే మంచి ఆల్బం ఇచ్చారు. ఐదు పాటల్లో మూడు హిట్ సాంగ్స్ ఆల్బంని సూపర్ హిట్ చేసింది. వచ్చాడయ్యో సామి పాట అయితే అందరి ఫేవెరెట్ సాంగ్ అయింది. బాలీవుడ్ సింగర్, డైరక్టర్, యాక్టర్ ఫర్హాన్ అక్తర్ తొలిసారి పాడిన పాట “ఐ డోంట్ నో” ని మళ్లీ మళ్లీ వింటున్నారు.

భారీ తారాగణం ట్రైలర్ లో మహేష్ పైనే ఫోకస్ పెట్టారు కానీ.. అతని చుట్టూ ఉన్నా ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి పాత్రలు సినిమాలో కీలకం కానున్నాయి. ఈ సినిమాకి సీనియర్ నటీనటులు ప్రధాన బలం కానున్నారు.

కొరటాల శివ తీసిన మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్ చిత్రాలు సమాజానికి సందేశానిస్తూనే కమర్షియల్ హిట్ సాధించాయి. ఇప్పుడు మహేష్ బాబుతో తీసిన భరత్ అనే నేను సినిమా కూడా సందేశాన్ని ఇస్తూనే వినోదాన్ని అందించనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus